Kurnool : కర్నూలు జిల్లాలో నాటు బాంబుల కలకలం
కర్నూలు జిల్లాలో నాటు బాంబుల కలకలం రేపాయి. జిల్లాలోని పత్తికొండలోని గౌలీకొండ పొలాల్లో పని చేయటానికి ఇద్దరు మహిళలు వెళ్లారు. అక్కడ వారికి రెండు నాటు బాంబులు కనపడ్డాయి. అవి ఏమిటో చూద

Kurnool Bomb Blast
Kurnool : కర్నూలు జిల్లాలో నాటు బాంబుల కలకలం రేపాయి. జిల్లాలోని పత్తికొండలోని గౌలీకొండ పొలాల్లో పని చేయటానికి ఇద్దరు మహిళలు వెళ్లారు. అక్కడ వారికి రెండు నాటు బాంబులు కనపడ్డాయి. అవి ఏమిటో చూద్దామని చేత్తో పట్టుకోగా ఒక బాంబు పేలి ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
Also Read : Parliament Covid19 : పార్లమెంటులో కరోనా కలకలం.. 850కి పెరిగిన కేసులు
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మహిళలను ఆస్పత్రికి తరలించారు. పేలని మరో బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని కర్నూలుకు తరలించగా మరొకరిని పత్తికొండ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పొలంలో నాటుబాంబులు ఎవరు పెట్టారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.