గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ రైల్వేస్టేషన్‌ లో శుక్రవారం(ఏప్రిల్-26,2019)ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. క్యాంటిన్‌ లో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్‌ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. క్యాంటిన్‌లో పని చేసేవారు, ప్రయాణికులు మంటలను గుర్తించి అలర్ట్ అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.