బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు

  • Publish Date - September 30, 2019 / 05:34 AM IST

తూర్పుగోదావరి  జిల్లాలోని ఓ బాణాసంచా తయారి కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. సామర్లకోట మండలం మేడపాడు శివారు ఇందిరా ఫైర్‌ వర్క్‌లో ఈ ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  

ప్రమాదానికి కారణమైన ఈ సంస్థ ఓ మాజీ ZPTCకి చెందినదిగా తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వీటిని తయారు చేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తోంది.