ఈ చట్టం కింద దేశంలో ఫస్ట్ : మార్చి 2న అత్యాచార నిందితుడికి ఉరి

చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించిన మానవ మృగాల అకృత్యాలు ఆగడం లేదు. అభం శుభం తెలియని 12ఏళ్ల లోపు పసిమొగ్గులపై కీచకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.

  • Publish Date - February 6, 2019 / 08:18 AM IST

చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించిన మానవ మృగాల అకృత్యాలు ఆగడం లేదు. అభం శుభం తెలియని 12ఏళ్ల లోపు పసిమొగ్గులపై కీచకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.

చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించిన మానవ మృగాల అకృత్యాలు ఆగడం లేదు. అభం శుభం తెలియని 12ఏళ్ల లోపు పసిమొగ్గులపై కీచకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కామాంధుల అకృత్యాలను అరికట్టేందుకు ఐపీసీ సెక్షన్ 376 ఏబీ (12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం) పోస్కో కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టంలో సవరణలు చేస్తూ ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం కింద నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి మార్చి 2న ఉరిశిక్ష విధించనున్నారు. 
 

గత ఏడాదిలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన మధ్యప్రదేశ్ స్కూల్ టీచర్ మహేంద్ర సింగ్ గోండ్ (23)కు శాంటా జిల్లా కోర్టు మరణ శిక్ష విధించింది. పోస్కో కొత్త చట్టంగా రూపుదాల్చిన తరువాత ఉరిశిక్ష పడే తొలి అత్యాచార నిందితుడు ఇతడే. మార్చి 2న జబల్ పూర్ జైల్లో మహేంద్ర సింగ్ ను ఉరి తీయనున్నారు. ఈలోపు నిందితుడు క్షమాభిక్ష కోసం సుప్రీంకోర్టు, రాష్ట్రపతికి అప్పీల్ చేసుకుంటే ఉరిశిక్షను తప్పించుకోనే అవకాశం ఉంది. లేదంటే కోర్టు డెత్ వారెంట్ ప్రకారం.. ఉరి శిక్షను ఎదుర్కొవాల్సిందే. 

కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తున్న మహేంద్ర సింగ్ గోండ్ తాగిన మైకంలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు గత ఏడాది జూలై 1న నిందితుడు గోండ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికపై అత్యాచారం ఘటన జరిగిన 50 రోజుల తరువాత ట్రయల్ కోర్టు మహేంద్ర సింగ్ ను దోషిగా తేల్చి మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.