×
Ad

Five Drown : ఏపీలో తీవ్ర విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి..

తరచూ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిoచాలన్నారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు.

Five Drown : ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. సముద్ర స్నానం ప్రాణాలు తీసింది. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఈ ఘోరం జరిగింది. స్నానం చేస్తూ అలల తాకిడికి ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి కోసం మెరైన్ పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు.

అటు కడప జిల్లా కమలాపురంలో ఈతకు వెళ్లి సుకన్య (11) అనే బాలిక చనిపోయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సాయికృష్ణ(15) అనే విద్యార్థి హంద్రీనీవా కాలువలో గల్లంతయ్యాడు.

చీరాల మండలం వాడరేవు తీరంలో విషాదంపై మంత్రి గొట్టిపాటి రవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
రెండు వేర్వేరు ఘటనల్లో విద్యార్థులు, పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. స్నేహితులను కాపాడేందుకు ఒకరి కోసం ఒకరు వెళ్లి విద్యార్థులు మృత్యువాత పడటం బాధాకరమన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి గొట్టిపాటి రవి.

తరచూ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిoచాలన్నారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. మృతదేహాలను కుటుంబసభ్యులకు త్వరగా అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు బయటకు వెళ్ళేటప్పుడు కళాశాల యాజమాన్యాల పర్యవేక్షణ ఉండాలన్నారు మంత్రి గొట్టిపాటి రవి.

Also Read: నకిలీ మద్యం కేసు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. సిట్‌ ఏర్పాటు.. సభ్యులు వీరే..