పెళ్లిలో ఫుడ్ పాయిజన్ : 500 మందికి అస్వస్ధత

  • Published By: chvmurthy ,Published On : February 19, 2019 / 04:22 AM IST
పెళ్లిలో ఫుడ్ పాయిజన్ : 500 మందికి అస్వస్ధత

భైంసా : నిర్మల్ జిల్లా భైంసాలో ఓ  పెళ్లి విందులో వడ్డించిన పాయసం తిని 500 మంది అస్వస్ధతకు గురయ్యారు. భైంసాలోని డీసెంట్ ఫంక్షన్ హాలులో జరిగిన వివాహా వేడుకలో ఈ ఘటన జరిగింది.  పాయసం తిన్నతర్వాత వాంతులు విరేచనాలతో బాధపడుతున్న కొందరిని భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొదట పదుల సంఖ్యలో అస్వస్ధతకు గురైనవారిని  గుర్తించినా …క్రమేపి ఈ సంఖ్య వందల సంఖ్యకు చేరుకోవటంతో  పెళ్ళి వారు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో చేరిన వారి ఆరోగ్యపరిస్ధితి నిలకడగానే ఉందని  డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత  పూర్తి సమాచారం అందాల్సి ఉంది.