Punjab : అక్రమాస్తుల కేసులో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం అరెస్ట్

పంజాబ్ రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమాస్తుల కేసులో సాక్షాత్తూ పంజాబ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనిని అరెస్ట్ చేసింది. 2016 నుంచి 2022వ సంవత్సరం వరకు ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై ఓపీ సోనిని విజిలెన్స్ బ్యూరో అరెస్ట్ చేసింది....

Former Punjab Deputy CM OP Soni Arrested

Punjab : పంజాబ్ రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమాస్తుల కేసులో సాక్షాత్తూ పంజాబ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనిని అరెస్ట్ చేసింది. 2016 నుంచి 2022వ సంవత్సరం వరకు ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై ఓపీ సోనిని విజిలెన్స్ బ్యూరో అరెస్ట్ చేసింది. ఇతన్ని సోమవారం అమృత్ సర్ కోర్టులో హాజరుపర్చనున్నారు. (Former Punjab Deputy CM OP Soni Arrested)

Bengal Panchayat elections : బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో 697 బూత్‌లలో రీ పోలింగ్

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశాల మేర అవినీతికి వ్యతిరేకంగా విజిలెన్స్ బ్యూరో ఈ చర్య తీసుకుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1), బి, 13(2) ప్రకారం సోనీపై కేసు నమోదు చేసినట్లు పంజాబ్ అధికారులు చెప్పారు. 2016 నుంచి 2022 వ సంవత్సరం వరకు మాజీ డిప్యూటీ సీఎం కుటుంబ ఆదాయం 4.52 కోట్ల రూపాయలు కాగా వారి ఖర్చు రూ.12.48 కోట్లు. ఆదాయం కంటే ఖర్చు 176 శాతానికి మించి పోయిందని విజిలెన్స్ బ్యూరో తేల్చింది. (Over Disproportionate Assets)

Balanagar : బాలానగర్‌లో అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, భయంతో బయటకు పరుగులు తీసిన జనం

మాజీ డిప్యూటీ సీఎం సోని తన భార్య సుమన్ సోనీ, కుమారుడు రాఘవ్ సోనీల పేరిట ఆస్తులు సంపాదించాడని, దీనిపై విచారణ సాగుతుందని విజిలెన్స్ అధికారులు చెప్పారు. మాజీ డిప్యూటీ సీఎం సోనీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యప్తు చేశారు. అక్రమాస్తుల కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కుశాల్ దీప్ సింగ్ ధిల్లాన్ ను కూడా పోలీసులు మే నెలలో అరెస్ట్ చేశారు.

Pawan Kalyan : సీఎం పదవికి జగన్ అనర్హుడు, చావుకైనా సిద్ధమే- పవన్ కల్యాణ్

ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం అవినీతి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించింది. ఎవరైనా ఏదైనా తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎం మాన్ చెప్పారు. అవినీతి కేసులో విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసిన నాలుగో వ్యక్తి కాంగ్రెస్ మాజీ మంత్రి ఓపీ సోనీ. గతంలో కాంగ్రెస్ నాయకులు, పంజాబ్ మాజీ మంత్రులు, భరత్ భూషణ్ అషు, సాధు సింగ్ ధరమ్‌సోత్‌లు ప్రస్తుత పాలనలో విజిలెన్స్ కేసులను ఎదుర్కొంటున్నారు.

Anand Deverakonda : ర‌ష్మిక ను వ‌దిన అని పిల‌వ‌డంపై ప్ర‌శ్న‌.. ఆనంద్ దేవ‌ర‌కొండ స‌మాధానం ఏంటంటే..?

ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి విజిలెన్స్ బ్యూరో ముందు కొన్ని సార్లు హాజరయ్యారు. చన్నీ తనపై కేసు దర్యాప్తును పూర్తి రాజకీయం అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ హయాంలో సుఖ్‌జీందర్ సింగ్ రంధావాతో పాటు ఓం ప్రకాష్ సోనీ సెప్టెంబర్ 20, 2021 మార్చి 11, 2022 మధ్య పంజాబ్ 4వ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ట్రెండింగ్ వార్తలు