Balanagar : బాలానగర్‌లో అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, భయంతో బయటకు పరుగులు తీసిన జనం

Balanagar : చుట్టుపక్కల ప్లాట్స్ లో నివాసం ఉంటున్న వారు ప్రాణభయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.

Balanagar : బాలానగర్‌లో అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, భయంతో బయటకు పరుగులు తీసిన జనం

Balanagar Fire Accident

Updated On : July 10, 2023 / 12:10 AM IST

Balanagar Fire Accident : హైదరాబాద్ బాలానగర్ పీఎస్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన అపార్ట్ మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

Also Read..Hyderabad : హైదరాబాద్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. మద్యం మత్తులో కారుతో స్కూటర్‌ను గుద్దిపడేసిన మహిళ.. ఒళ్లుగగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో

A2A Life Spaces అపార్ట్ మెంట్ లో రాత్రి 9గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్ మెంట్ 5వ ఫ్లోర్ లో ప్రమాదం జరిగింది. ఓ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ప్లాట్స్ లో నివాసం ఉంటున్న వారు ప్రాణభయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా తగలబడ్డాయి. అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరో కారణమా? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.