Singareni Workers Died
Singareni Colleries : మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సింగరేణి కాలరీస్ కు చెందిన శ్రీ రాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి 3 బొగ్గు గనిలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మొదటి షిఫ్టు కార్మికులు విధులు నిర్వహిస్తుండగా గని పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.
కొందరు కార్మికులు దాని కిందే చిక్కుకుపోయారు. మృతులను కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లచ్చయ్య, చంద్రశేఖర్ గా తెలిసింది. ఘటనా స్ధలంలోనే ఇద్దరు మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సింగరేణి రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది.
Also Read : Bail To Shivalinga Prasad : హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ కు బెయిల్
గనిలో ప్రమాద వార్త తెలిసి కార్మికుల కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. మృతుల కుటుంబాలు,బంధువులు గని వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై గని అధికారులు విచారణ చేపట్టారు. శ్రీరాంపూర్ పోలీసులు సంఘటన జరిగిన గని వద్దకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.