మంగళగిరిలో గెలుపుపై బెట్టింగ్: ఏడుగురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వైపు చంద్రబాబు మరోవైపు జగన్‌లు తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరి సీటు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీటు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారాలోకేష్ పోటీలో ఉండడం.. ఈ సీటు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నాయకుడు ఆళ్ల రామకృష్ణకే మళ్లీ సీటు దక్కడంతో గెలుపుపై పందెం రాయుళ్లు పందేలు విపరీతంగా కడుతున్నారు.
ఈ క్రమంలో మంగళగిరిలో ఎన్నికల బెట్టింగ్ నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.10.15లక్షలు, కారు, 7 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల బెట్టింగ్ జరుగుతున్నట్లు ఫోన్ రావడంతో రైడ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ నిలబడినప్పటికీ టీడీపీకి పెద్దగా పట్టు లేకపోవడంతో ఇక్కడ వైసీపీకి కలిసివచ్చే అంశం.