Sullurupeta Bus Stand
Ganja Seized In Sullurpet : ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో పోలీసులు జరిపిన వివిధ తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్ధానిక సీఐ వెంకటేశ్వర్లు రెడ్డి వాహనాల తనిఖీలు చేపట్టారు.
నెల్లూరు నుండి చెన్నైకి వెళ్లే కావలి డిపోకు చెందిన AP26 Z 0315 బస్సులో ఓ బ్యాగులో ఆరు కేజీల గంజాయిని గుర్తించారు. పోలీసులు తనిఖీలు చేస్తుండటం చూసిన వ్యక్తులు, గంజాయి సంచులను బస్సులోనే వదిలి పరారయ్యారు. వారి కోసం సీఐ తన సిబ్బందితో పట్టణం మొత్తం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆ ఇద్దరు వ్యక్తులు ఆచూకీ లభ్యం కాలేదు.
Also Read : Ganja Seized : హైదరాబాద్‌లో రౌడీ షీటర్ అరెస్ట్-2 కిలోల గంజాయి స్వాధీనం
అనంతరం తమిళనాడుకి చెందిన TN 21N 2053 ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి వద్ద నాలుగు కేజీల గంజాయి ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా సూళ్లురుపేట పట్టణంలో గంజాయిని కొన్ని ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు వారి ఇళ్లపై దాడులు చేయగావారి వద్ద నుండి 5 కేజీల గంజాయిని మరియు ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.