హయత్‌నగర్‌లో బాలిక కిడ్నాప్ కలకలం
హైదరాబాద్ లోని హయత్‌నగర్‌లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. నాగర్‌కర్నూల్ వైపు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లోని హయత్‌నగర్‌లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. నాగర్‌కర్నూల్ వైపు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లోని హయత్‌నగర్‌లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. నాగర్‌కర్నూల్ వైపు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌పై బాలిక తల్లిదండ్రులు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
14 సంవత్సరాల వయస్సు గల అంజలి.. పెద్ద అంబర్ పేటలోని జెడ్ పీహెచ్ ఎస్ లో 9 వ తరగతి చదువుతోంది. నవంబర్ 5న స్కూల్ వెళ్లన అంజలి.. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి మహేష్ హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమ్మాయి కనిపించడం లేదని నవంబర్ 5 సాయంత్రం ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం ఇప్పటివరకు పట్టించుకోలేదని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొంతమంది కిడ్నాపర్లు అమ్మాయిని నాగర్ కర్నూలు వైపు తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.