Principal Threw Hot Rice On Girl : యూపీ ప్రభుత్వ స్కూల్ లో దారుణం.. దివ్యాంగురాలైన దళిత బాలికపై వేడి అన్నం విసిరిన ప్రిన్సిపాల్‌

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన దళిత బాలికపై స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వేడి వేడి అన్నం విసిరాడు. దీంతో ఆమె శరీరంపై కాలిన గాయాలయ్యాయి. ఈ సంఘటన బారాబంకి జిల్లాలో చోటు చేసుకుంది.

Principal Threw Hot Rice On Girl : మంచి నీటి కుండను తాకాడని విద్యార్థిపై టీచర్ దాడి చేసిన ఘటన మరువకముందే మరో ఘోరమైన సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన దళిత బాలికపై స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వేడి వేడి అన్నం విసిరాడు. దీంతో ఆమె శరీరంపై కాలిన గాయాలయ్యాయి. ఈ సంఘటన బారాబంకి జిల్లాలో చోటు చేసుకుంది. ఆగస్టు 29న ఇచ్చోలి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు.

అయితే రెండో తరగతి చదవుతున్న దళిత బాలికపైకి ప్రిన్సిపాల్‌ వేడి అన్నం విసిరాడు. దీంతో ఆ బాలిక చేయి, మోచేతికి కాలిన గాయాలయ్యాయి. సెప్టెంబర్‌ 3న జరిగిన తాసిల్‌ దివస్‌లో ఆ బాలిక తల్లి అధికారులకు తెలిపింది. స్కూల్‌ ప్రిన్సిపల్‌ తన కుమార్తెపైకి వేడి అన్నం విసరడంతో ఆమె చేతికి కాలిన గాయాలయ్యాయంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.

MP: దళితుడువి జెండా ఎగురవేస్తావా..అంటూ సర్పంచ్ పై కార్యదర్శి దాడి

దీంతో ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్‌ స్పందించారు. దీనిపై దర్యాప్తు చేయాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. మరోవైపు ఆ బాలిక దివ్యాంగురాలని జిల్లా ఎస్పీ వెల్లడించారు. విద్యాశాఖ అధికారి నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు