Grace orphan organizers arrested..
Grace orphan organizers arrested..నేరేడ్ మెంట్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా గ్రేస్ చిల్డ్రన్స్ ఆశ్రమం నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అకౌంటెంట్ మురళి, గణేశ్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అలాగే గ్రేస్ ఆశ్రమం ఇన్ చార్జ్ విక్టర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తే మరన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఆశ్రమంలోని విద్యార్దులను నింబోలి అడ్డాలోని ఆశ్రమాలకు తరలించారు. వీరిలో మైనర్లతో పాటు మేజర్లు కూడా ఉన్నారు.
కాగా..బంజారాహిల్స్ డీఏవీ స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనను మరవక ముందే.. మతం మాటున కొనసాగుతున్న ఓ అనాథాశ్రమంలో లైంగిక వేధింపులు, మరో చిల్డ్రన్‌హోంలో బాలికలతో బాడీ మసాజ్‌లు చేయించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ఘటనల్లో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు, పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నేరెడ్‌మెట్‌లోని జేజేనగర్‌లో ఉన్న గ్రేస్ అనాథాశ్రమంలో 14-15 ఏళ్ల మధ్య వయసుగల 34 మంది బాలికలు ఉన్నారు. వీరిపై కొంతకాలంగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. విషయాన్ని బటయకు పొక్కనీయకుండా ఆశ్రమ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.వారి పైశాచికత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలీక..తమ బాధను తమలోనే దాచుకుని కృంగిపోతున్నారా చిన్నారులు. ఈక్రమంలో సోమవారం (అక్టోబర్,2022)రాత్రి ముగ్గురు బాలికలపై లైంగిక దాడి జరిగిందంటూ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్‌కు ఫిర్యాదు అందింది. దీంతో.. నేరెడ్‌మెట్ పోలీసులు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు గ్రేస్ ఆశ్రమానికి చేరుకుని, విచారణ చేపట్టారు. బాధిత బాలికలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆశ్రమంలోని మిగతా బాలికలను నింబోలిఅడ్డాలోని స్టేట్ హోంకు తరలించారు.
కాగా..అక్టోబర్ 19న గ్రేస్ చిల్డ్రన్స్ ఆశ్రమంలో నలుగురు బాలికలు కనిపించకుండా పోయారు. వీరిలో ఒకరు మేజర్, మరో ముగ్గురు మైనర్ బాలికలు ఉన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన నేరెడ్‌మెట్ పోలీసులు వారిని గుర్తించారు. ఇద్దరు సికింద్రాబాద్లోను..మరో ఇద్దరు బంధువుల ఇంట్లో ఉన్నట్లు నిర్ధారించారు. వారిని సఖీ సెంటర్‌కు తరలించారు. సఖీ సెంటర్లో లైంగిక దాడి విషయాన్ని మైనర్ బాలిక పోలీసులకు వెల్లడించారు. ఆశ్రమంలో అకౌంటెంట్ మురళి లైంగిక దాడికి పాల్పడతున్నాడని అందుకే పారిపోయామని బాలిక తెలిపింది. బాలిక ఫిర్యాదుతో మురళితోపాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.