Bihar Truck Driver
Domestic Dispute : ఇంట్లో గొడవలు పెడుతోందనే అసహనంతో నానమ్మపైకి లారీ ఎక్కించి చంపిన మనవడి ఉదంతం బీహార్ లో వెలుగు చూసింది. ముజఫర్ పూర్ లోని కర్జా పోలీసు స్టేషన్ పరిధిలోని రాక్సా గ్రామానికి చెందిన దిలీప్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
ఎప్పుడూ ఊళ్లు తిరుగుతూ ఉండే దిలీప్ దసరా పండగకు ఇంటికి వచ్చాడు. పండగకు వచ్చిన సమయంలో ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకు కారణం తన నానమ్మ డోమ్నీదేవిగా భావించాడు. పండగకు ప్రశాంతంగా ఇంట్లో ఉందామని వస్తే… గొడవలు జరగటం భరించలేక పోయాడు. నానమ్మను హెచ్చరించాడు.
ఇంట్లో గొడవలకు నువ్వే కారణం అంటూ ఆమెతో గొడవకు దిగాడు. అంతలో అతని తండ్రి రాజేశ్వరరాయ్ కల్పించుకుని గొడవ సర్ధుమణిగేలా చేసి…దిలీప్ ను ఇంటినుంచి బయటకు పంపించివేశాడు. అనంతరం వృధ్దురాలైన నానమ్మ ఇంటి ముందు గుమ్మం తుడుస్తుండగా దిలీప్ లారీని ఆమెపైకి ఎక్కించి హత్య చేశాడు.
డోమ్నీ దేవి అక్కడికక్కడే మరణించింది. తండ్రి రాజేశ్వర రాయ్ ఫిర్యాదు మేరకు కర్జాపోలీసులు కేసు నమోదు చేసుకుని దిలీప్ ను అరెస్ట్ చేశారు. వృధ్దురాలి హత్యకు కారణమైన లారీని అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు కారణమైన లారీ