Gun Firing Incident : హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం రేగింది. వెంకటేశ్వర కాలనీలోని రోడ్ నెంబర్ 14 దగ్గర గల మల్లికా రాణి అపార్ట్ మెంట్ దగ్గర ఓ వ్యక్తి ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. తనకు తెలియకుండా తన ప్రియురాలిని బలవంతంగా అమెరికాకు పంపడంతో.. అమ్మాయి తండ్రిపై ప్రియుడు కాల్పులు జరపడం సంచలనంగా మారింది. అంబర్ పేట్ కు చెందిన బల్విందర్ సింగ్, మన్విత.. కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
అయితే, ఈ విషయం మన్విత తండ్రి రేవంత్ ఆనంద్ కు తెలియడంతో.. ఆయన ఎవరికీ చెప్పకుండా తన కూతురిని అమెరికా పంపాడు. ఈ విషయం తెలిసిన ప్రియుడు బల్విందర్ సింగ్.. మన్విత ఇంటికి వెళ్లాడు. మన్విత తండ్రి ఆనంద్ తో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహానికి గురైన బల్విందర్ తన వెంట తెచ్చుకున్న ఎయిర్ గన్ తో రేవంత్ ఆనంద్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రేవంత్ ఆనంద్ కంటి దగ్గరి నుంచి బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బల్విందర్ సింగ్ ను అరెస్ట్ చేశారు.
కూతురి ప్రేమ వ్యవహారం తండ్రి ప్రాణాల మీదకు తెచ్చిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీకి చెందిన మన్విత, అంబర్ పేట్ కు చెందిన బల్విందర్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఈ విషయం మన్విత తండ్రికి తెలిసిందే. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రియుడు బల్విందర్ కు తెలియకుండా తన కూతురిని అమెరికా పంపేశారు తండ్రి ఆనంద్.
ఈ విషయం బల్విందర్ కు తెలిసిందే. దీంతో అతడు ఆదివారం మధ్యాహ్నం వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 14లోని మల్లికా రాణి అపార్ట్ మెంట్ లోకి వెళ్లాడు. మన్విత తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన బల్విందర్ తన వెంట తెచ్చుకున్న ఎయిర్ గన్ తో ఆనంద్ పై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. దీంతో రేవంత్ కంటికి గాయమైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. రేవంత్ ను కంటి ఆసుపత్రికి తరలించారు.
ప్రేమ వ్యవహారమై బల్విందర్ ను గతంలోనూ మన్విత తండ్రి మందలించినట్లు తెలుస్తోంది. దానికి తోడు మన్వితను అమెరికా పంపేశాడు. దీంతో మన్విత ప్రియుడు బల్విందర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ వ్యవహారంలో మన్విత తండ్రితో గొడవ పడేందుకు అతడు వెళ్లాడు. ఈ క్రమంలో ఎయిర్ గన్ తో ఆనంద్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పోలీసులు బల్విందర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కాల్పుల ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక భయాందోళనకు గురయ్యారు.
Also Read : ఇండియన్స్ అంటే చిన్నచూపా? పెప్సీ-యూనీలివర్ నాసిరకం ఉత్పత్తులపై సంచలన నివేదిక..!