PepsiCo, Unilever Products : ఇండియన్స్ అంటే చిన్నచూపా? పెప్సీ-యూనీలివర్ నాసిరకం ఉత్పత్తులపై సంచలన నివేదిక..!

PepsiCo - Unilever Products : సంపన్న దేశాల్లో విక్రయించే ప్రొడక్టుల క్వాలిటీతో పోల్చితే.. భారత మార్కెట్లో నాసిరకం పోషక విలువలతో కూడిన ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని నివేదిక బయటపెట్టింది.

PepsiCo, Unilever Products : ఇండియన్స్ అంటే చిన్నచూపా? పెప్సీ-యూనీలివర్ నాసిరకం ఉత్పత్తులపై సంచలన నివేదిక..!

PepsiCo, Unilever sell lower quality products in India ( Image Source : Reuters)

Updated On : November 10, 2024 / 9:48 PM IST

PepsiCo, Unilever lower quality products : భారతీయుల పట్ల మల్టీనేషనల్ కంపెనీల తీరుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ వంటి తక్కువ ఆదాయ దేశాల్లో ప్రధాన ఆహార, పానీయాల కంపెనీలు లో-క్వాలిటీ ప్రొడక్టులను విక్రయిస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. దశాబ్ధాలు గడుస్తున్నా భారతీయులపై చిన్నచూపు చూడటం ఆగ్రహాన్ని రేకిత్తిస్తోంది. అమెరికాకు చెందిన హిందుస్థాన్ యూనీలివర్, పెప్సికో అనేక వ్యాపారాల్లో వివిధ ప్రొడక్టులను భారత మార్కెట్లో విక్రయిస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు ఈ కంపెనీల ప్రొడక్టులను వినియోగిస్తూనే ఉన్నారు.

కొత్త నివేదిక ప్రకారం.. సంపన్న దేశాల్లో విక్రయించే ప్రొడక్టుల క్వాలిటీతో పోల్చితే.. భారత మార్కెట్లో నాసిరకం పోషక విలువలతో కూడిన ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని నివేదిక బయటపెట్టింది. ఈ నాసిరకం ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోననే ఆందోళనలను రేకెత్తిస్తుంది. యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనిషియేటివ్ (ATNI) ప్రచురించిన గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం.. నెస్లే, పెప్సికో, యూనిలీవర్ కంపెనీలు హెల్త్ రేటింగ్ సిస్టమ్‌లో తక్కువ స్కోర్‌లతో తక్కువ-ఆదాయ దేశాలలో ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు గుర్తించింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో అభివృద్ధి చేసిన రేటింగ్ సిస్టమ్ తక్కువ-ఆదాయ దేశాలలో సగటు స్కోరు 5కి 1.8 కాగా, అధిక-ఆదాయ దేశాలకు 2.3గా ఉంది. నివేదిక ప్రకారం.. 3.5 కన్నా ఎక్కువ స్కోర్ ఉన్న ఉత్పత్తులు ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. నాన్ ప్రాఫిట్ గ్రూప్ అలాంటి 30 కంపెనీలను అంచనా వేసింది. “ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఈ కంపెనీలు విక్రయిస్తున్న ఉత్పత్తులు ఆరోగ్యకరమైనవి కాదని తేలిందని ఏటీఎన్ఐ పరిశోధనా డైరెక్టర్ మార్క్ విజ్నే రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు. ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది ఊబకాయంతో జీవిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 70 శాతం మంది తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, బంగాళాదుంప చిప్స్, కోలా పానీయాలు వంటి స్నాక్స్ ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ కారకాలుగా ఉన్నట్లు కనుగొన్నారు.

భారత్ లాంటి అధిక జనాభా కలిగిన దేశాల్లో ఈ కంపెనీల ఉత్పత్తులు అధికంగా వినియోగిస్తున్నారని తేలింది. ఈ నివేదికను పరిశీలిస్తే.. అనేక మంది సామాన్య మధ్యతరగతి భారతీయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాల్సిందిగా పోషక నిపుణులు కోరుతున్నారు.

Read Also : Arjun Kapoor : బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌కు హషిమోటో వ్యాధి.. దీని లక్షణాలేంటి? చికిత్స, నివారణ పద్దతులివే!