Guntur Mp Raghurama Release Postponed
MP Raghu Rama Krishna Raju : రాజద్రోహం కేసు కింద అరెస్టైన నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు విడుదల మరో నాలుగు రోజులు వాయిదా పడింది. కోర్టు ఆదేశాలతో సోమవారం రఘురామ న్యాయవాదులు ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశారు. కాగా సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నఆయన ఆరోగ్య పరిస్ధితిని గుంటూరు జిల్లా మెజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ సమ్మరీ కావాలని న్యాయమూర్తి అడిగారు. అయితే రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావటానికి మరో నాలుగు రోజులు సమయం పడుతుందని ఆర్మీ వైద్యులు మెజిస్ట్రేట్ కు తెలపటంతో రఘురామ విడుదల వాయిదా పడింది. నాలుగురోజుల తర్వాత మరోసారి సీఐడీ కోర్టులో ష్యూరిటీ పిటీషన్ వేస్తామని రఘురామతరుఫు న్యాయవాదిలక్ష్మీనారాయణ తెలిపారు.
రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన రఘురామకు సుప్రీంకోర్టు మే 21న బెయిల్ మంజూరు చేసింది. గుంటూరులోని ట్రయల్ కోర్టులో కేసు నడుస్తుండటంతో పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండటం వల్ల ఎంపీ విడుదలకు ఈప్రక్రియ జరగాల్సి ఉంది.