Family Murder : ప్రియుడి కోసం స్త్రీ గా మారుతానన్న యువకుడు…ఒప్పుకోకపోవటంతో కుటుంబం హత్య

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా, జజ్జర్ చుంగీలో  గత నెల 27న ఒకే కుటుంబంలో జరిగిన వరస హత్యలలో విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి.

jhajjar murder case

Family Murder :  హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా, జజ్జర్ చుంగీలో  గత నెల 27న ఒకే కుటుంబంలో జరిగిన వరస హత్యలలో విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి. కేసు విచారణలో కొన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ పోలీసులు ఇటీవల కొంత పురోగతి సాధించారు. మొదట్లో ఆస్తి తగాదాల విషయంలో హత్యలు జరిగాయని భావించినా…ఈహత్యలలో కొత్త కోణం వెలుగు చూసింది.

తాను ప్రేమించిన యువకుడి కోసం యువతిగా మారతానని…లింగ మార్పిడికోసం రూ.5 లక్షలు ఇవ్వాలని నిందితుడి కుటుంబ సభ్యులను అడిగాడు. అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతే కాక ఆస్తి మొత్తాన్ని తమ కూతురు పేరిట రాసేశారు. దీంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడయ్యింది.

ఈ ఘటనలోనిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం తల్లి తండ్రులు, నాన్నమ్మ, సోదరిని తుపాకీతో కాల్చి చంపాడు. నిందితుడు అభిషేక్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి పలు కీలక విషయాలను రాబట్టారు. కుటుంబ సభ్యులను హతమార్చినా అతడిలో ఎటువంటి పశ్చాత్తాపం కనపడలేదు కానీ.. అతని ప్రియుడి విషయం ప్రస్తావించినప్పుడల్లా కన్నీటి పర్యంతమయ్యేవాడుట.  కాగా ఈ కేసులో నిందుతుడైన అభిషేక్ ప్రియుడు ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీనుంచి రోహతక్ కు వచ్చాడు. అతని కారుని కూడా పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.
Read Also : Illegal Affair : అక్రమ సంబంధం కొనసాగించాలని యువతిపై దాడి

ప్లీజ్ సార్…. ఒక్కసారి నా ప్రియుడిని చూడనివ్వండి సార్…. మీరు నన్ను ఏ జైలులో వేసినా పర్లేదు సార్ అంటూ అభిషేక్ పోలీసులను కాళ్లా,వేళ్లా పడి ప్రాధేయపడ్డాడుట. దీంత పోలీసులు ఓసారి నిందితుడికి మానసిక వైద్యుడితో కౌన్సెలింగ్ ఇప్పించారు. ఆదివారంతో నిందితుడి రిమాండ్ ముగుస్తుంది. అయితే నిందితుడి నుంచి పూర్తి వివరాలను రాబట్టేందుకు  మరికొన్ని రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేయనున్నారు.