ప్రియుడితో కలిసి కన్నతల్లినే అత్యంత దారుణంగా హతమార్చిన కీర్తిరెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఈ ఉదంతంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనేక కోణాలు వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా మద్యం తాగి తన ప్రియుడు శశికుమార్‌తో కలిసి తల్లి రజితను చంపినట్లు సమాచారం. తల్లి రజితను అత్యంత కిరాతకంగా చంపిన కీర్తి తప్పించుకునేందుకు చాలానే ట్రై చేసింది. తల్లి మృతదేహాన్ని తరలించిన తర్వాత తన నాటకాన్ని కంటిన్యూ చేసింది కసాయి కీర్తిరెడ్డి.
విచారణలో సంచలన విషయాలు వెల్లడించింది కీర్తి. తాను వైజాగ్ టూర్‌కు వెళ్లానని తండ్రికి చెప్పి.. ఇంటి వెనకాలే ఉండే ప్రియుడి శశితో గడపానని విచారణలో పేర్కొంది. 2019, అక్టోబర్ 23న అమ్మ రజిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశానంది. మా నాన్న తాగొచ్చి ఇబ్బంది పెట్టడం వల్లనే మా అమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు మొదటిరోజు విచారణలో పోలీసులు ముందు వెల్లడించింది కీర్తి.
ఇక రెండో రోజు విచారణలో భాగంగా…మరికొన్ని నిజాలు పోలీసుల ముందు ఒప్పుకుంది కీర్తి. అమ్మను అక్టోబర్ 19వ తేదీన తల్లిని చంపానంది. 21 వరకు ఇంట్లోనే ప్రియుడు శశితో ఉన్నానంది, అయితే దుర్వాసన వస్తుండటంతో.. శవాన్ని శశి సాయంతో ట్రాక్‌పై పడేశానని పోలీసులకు తెలిపింది.
మూడో రోజు ఇన్వెస్టిగేషన్‌లో పలు నిజాలు ఒప్పుకుంది కీర్తి. శశికి దూరంగా ఉండమని మా అమ్మ చాలా సార్లు చెప్పింది. ఆ విషయం నేను శశికి చెప్పానంది. దీంతో మా అమ్మని చంపేస్తే హ్యాపీగా ఉండొచ్చని నాకు చెప్పాడని విచారణలో చెప్పంది.
ఇక నాలుగోరోజు మా అమ్మను ఎలా చంపాలో..? ఎప్పుడు చంపాలో శశినే చెప్పాడని పోలీసుల ముందు ఒప్పుకుంది. శశి ప్రేరేపించడంతోనే హత్య చేసినట్లు పేర్కొంది. మా అమ్మను చంపేయాలని శశి నాతో ఎప్పుడో చెప్పాడంది. శశి ఇచ్చిన ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు విచారణలో తెలిపింది కీర్తిరెడ్డి.
ఐదోరోజు విచారణలో భాగంగా… అమ్మను చంపడానికి నాకు ధైర్యం చాల్లేదని చెప్పుకొచ్చింది కీర్తి. మందు తాగితే ధైర్యం వస్తుందని శశి చెప్పాడంది. దాంతో ఇద్దరం కలిసి మందు తాగామని… ఆ తర్వాత శశి చెప్పినట్లు మా అమ్మను హత్య చేశానని పేర్కొంది.
Read More : జూబ్లి బస్టాండు వద్ద కలకలం : బ్యాగులో కళ్లు తెరవని పసికందు