Chhattisgarh Encounter : చ‌త్తీస్‌ఘ‌డ్ ఎన్ కౌంటర్ నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్

Chhattisgarh Encounter : చ‌త్తీస్‌ఘ‌డ్ ఎన్ కౌంటర్ నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ చత్తీస్ ఘడ్, బీజాపూర్ సుక్మా జిల్లా సరిహద్దుల్లో శనివారం మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏపీ బోర్డర్ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

సుక్మా జిల్లా సరిహద్దుల్లో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో వివిధ దళాలకు చెందిన 22 మంది జవాన్లు మరణించారు. ఈ ఎన్ కౌంటర్ లో మరణించారు. మరో 30 మంది జవాన్లు గాయపడ్డారు. అనేక మంది జవాన్లు మిస్సైనట్లు తెలుస్తోంది. ఎన్ కౌంటర్ తర్వాత ఏపీ-చత్తీస్ ఘడ్ బోర్డర్ లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. దానితో పాటు ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్ లో కూడా పోలీసు నిఘా పెంచారు. మావోల కోసంగాలింపు చేపట్టారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అలర్టైంది. మావోలు రాష్ట్రంలోకి ప్రవేశించే అన్నిమార్గాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో సోమవారం సీఆర్ఫీఎఫ్ బలగాలు భారీగా మోహరించాయి. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడ్డ మవోయిస్టులు పక్క రాష్ట్రాలకు పరారయ్యే అవకాశం ఉండటంతో రెండు రాష్ట్రాల సరిహద్దులో పోలీసు పహరా పెంచారు.

మావోయిస్టులు ఛత్తీస్‌ఘడ్ నుంచి గోదావరి ఇవతలి ఒడ్డుకు వస్తారన్న అనుమానంతో భద్రతా దళాలు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లా ఏజెన్సీని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. సుమారు400 నుంచి 500 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గోన్నట్లు తెలుస్తోంది.

మాయోపాయంతో భద్రతా దళాలను అడవిలోకి రప్పించిన మావోయిస్టులు…. భద్రతా దళాలపై ముప్పేట దాడి చేశారు. మెషీన్ గ‌న్‌ల‌తో కాల్పులు జ‌రిపి జ‌వాన్ల ప్రాణాల‌ను బ‌లి తీసుకున్నారు. ఇరు వర్గాల మధ్య కొన్ని గంటలపాటు జరిగిన భీకరపోరు యుధ్ధాన్ని తలపించింది. వీఐపీలకు భద్రత పెంచారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించవద్దని ఏపీ పోలీసులు సూచన చేశారు.

ట్రెండింగ్ వార్తలు