చందానగర్‌లో టెన్షన్ టెన్షన్… వాతావరణం నెలకొంది. హేమంత్ హత్య కేసులో నిందితులను శిక్షించాలంటూ అవంతి ఆందోళనకు దిగింది.
అవంతికి మద్దతునిస్తూ సీపీఐ నారాయణ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అవంతితో పాటు రోడ్డుపై కూర్చుని నారాయణ ఆందోళన చేశారు.
హంతకులకు వ్యతిరేకంగా న్యాయవాదుల జేఏసీ నినాదాలు చేసింది. పరువు హత్యలకు వ్యతిరేకంగా నూతన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు అవంతి ఆందోళనను అడ్డుకోవడంతో ఆమె రోడ్డుపై బైఠాయించింది.