Surat: గుజరాత్‌లోని సూరత్‌లో దారుణం జరిగింది. ముస్లిం భార్య, బావమరిది.. బలవంతంగా బీఫ్ తినిపించడంతో హిందూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి కొన్నేళ్లక్రితం సోనమ్ అలీ అనే ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
ఈ పెళ్లికి రోహిత్ కుటుంబ సభ్యులు నిరాకరించారు. అయితే, వాళ్ల మాటను కాదని రోహిత్.. సోనమ్ అలీని పెళ్లి చేసుకున్నాడు. అప్పట్నుంచి రోహిత్ తన కుటుంబానికి దూరంగా, సోనమ్ అలీతో కలిసి ఉంటున్నాడు. కొన్నేళ్లుగా అతడికి తన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. కాగా, ఇటీవల రోహిత్ భార్య సోనమ్, అతడి బావమరిది అక్తార్ అలీ.. ఇద్దరూ కలిసి అతడికి బలవంతంగా బీఫ్ తినిపించారు. తను బీఫ్ వద్దని ఎంత వేడుకున్నా వినకుండా, చంపుతామని బెదిరించి రోహిత్‌తో బీఫ్ తినిపించారు. దీంతో వేదనకు గురైన రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఈ విషయం మొత్తాన్ని ఆత్మహత్యకు ముందు రోహిత్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. తన ఆత్మహత్యకు ఈ ఘటనే కారణమని, తన భార్య, బావమరిదిపై చర్యలు తీసుకోవాలని ఆ పోస్టులో కోరాడు.
CM KCR: ఎల్లుండి బిహార్‌కు సీఎం కేసీఆర్.. నితీష్ కుమార్‌తో జాతీయ రాజకీయాలపై చర్చ
తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత అతడి సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. దీంతో రోహిత్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.