Hyderabad School
Hyderabad school : హైదరాబాద్ లోని ఓ స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. ప్రతీరోజులానే స్కూల్ కొచ్చిన చిన్నారి టీచర్ కొట్టిన దెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు. హోం వర్క్ చేయలేదని టీచర్ పలకతో యూకేజీ విద్యార్ధి తలపై కొట్టటంతో చిన్నారి చనిపోయాడు. రామంతపూర్ లోని ఓ స్కూల్లో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోం వర్క్ చేయలేదని టీచర్ బాలుడి తలపై పలకతో కొట్టింది. దీంతో బాబు చనిపోయాడు.
టీచర్ కొట్టటంతో బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు.వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ బాబు చికిత్స పొందుతు ఆదివారం మరణించాడు.దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతీరోజులానే స్కూల్ కెళ్లిన తన బిడ్డడు చనిపోవటంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది..
రామంతపూర్ లోని వివేక్‌నగర్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో జరిగిన ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చిన్నపిల్లాడిని అంతగా కొడతారా..? హోం వర్క్ చేయకపోతే మందలించాలి గానీ కొడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు, పాఠశాల యాజమాన్యం స్పందించడంతో ఆందోళన విరమించారు. కాగా బాబు గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడ్డాడని..జ్వరం తగ్గాక తల్లిదండ్రులు స్కూల్ కు పంపించారు. ఈక్రమంలో హోం వర్క్ చేయలేదని టీచర్ కొట్టటంతో చనిపోవటం జరిగింది…