Hyderabad Honey Trap: బీకేర్ ఫుల్.. ఒక్క వాట్సాప్ కాల్‌తో.. 7లక్షలు కొట్టేశారు.. 81ఏళ్ల వృద్ధుడిని ఇలా మోసం చేశారు..

గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్ ను అటెండ్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఫలితంగా భారీగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

Hyderabad Honey Trap: సైబర్ చీటర్స్ తో జాగ్రత్త అని పోలీసులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. సైబర్ క్రైమ్స్ గురించి అనేక రకాలుగా జనాల్లో అవగాహన పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏయే పద్ధతుల్లో సైబర్ క్రిమినల్స్ నేరాలకు పాల్పడుతారో వివరించి వారి బారిన పడొద్దని జాగ్రత్తలు చెబుతున్నారు.

అయినా, కొందరు అడ్డంగా మోసపోతూనే ఉన్నారు. సైబర్ చీటర్స్ బారిన పడుతూనే ఉన్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.

సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు మంచివి కాదని పోలీసులు చెబుతూనే ఉన్నారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్ ను అటెండ్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఫలితంగా భారీగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

మహిళ పేరుతో కాల్స్, మెసేజెస్..

తాజాగా హైదరాబాద్ అమీర్ పేట్ లో హనీ ట్రాప్ వెలుగుచూసింది. వాట్సాప్ కాల్ ద్వారా హానీ ట్రాప్ కు పాల్పడ్డారు సైబర్ చీటర్. 81 ఏళ్ల వృద్ధుడిని మోసగించారు. అమీర్ పేట్ కు చెందిన వృద్ధుడికి జూన్ మొదటి వారం నుండి మాయ రాజ్ పుత్ అనే మహిళ పేరుతో కాల్స్, మెసేజెస్ చేశారు స్కామర్స్.

ముద్దు ముద్దు మాటలతో హనీట్రాప్..
ముద్దు ముద్దు మాటలతో వృద్ధుడికి దగ్గరయ్యారు. చనువుగా మాట్లాడుతూ హానీ ట్రాప్ చేశారు. వృద్ధుడు తమ ట్రాప్ లో చిక్కాడని నిర్ధారించుకున్న స్కామర్లు.. వైద్యం ఖర్చులు, ప్లాట్ రిజిస్ట్రేషన్, తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించడం కోసం అంటూ డబ్బులు లాగారు.

ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి 7లక్షలు కొట్టేశారు..
బాధితుడిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేశారు. వారి మాయలో పడిపోయిన వృద్ధులు 7 లక్షల 11 వేలు రూపాయలు పోగొట్టుకున్నాడు.

స్కామర్లు ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన బాధితుడు.. కుటుంబసభ్యులకు విషయం చెప్పాడు.

వారి సూచనతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వృద్ధుడు.

Also Read: వామ్మో.. గంజాయితో పాటు రివాల్వర్లు, మారణాయుధాలు.. షాక్‌లో ఖమ్మం ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌‌ అధికారులు..