భార్యపై అనుమానంతో అక్కడ గమ్‌తో అతికించేశాడు

సొసైటీ ఎంత ముందుకెళ్తున్నా.. పాతకాల పద్ధతుల్లో వక్రబుద్ధి మిగిలే ఉంది. అనుమానంతో భార్యపై వికృత చర్య చేశాడో భర్త. చెడుదారిలో వెళ్తున్నా వివాహ సంబంధం చెడిపోకూడదనే అలా చేశాడని చెప్తున్నాడు.
పెళ్లి అవ్వగానే అర్థాంగి తన ఆస్తిలా భావించడం.. వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం వస్తే చాలు చంపేయడమో.. లేదా చిత్రహింసలు పెట్టడమో చూస్తూనే ఉన్నాం. ఇది ఏ ఒక్క సంప్రదాయంలోనో కాదు.. ప్రపంచమంతా ఇదే పరిస్థితి.
కెన్యాలో ఓ భర్త.. తన భార్యపై అనుమానంతో జననాంగాన్ని గమ్ముతో అంటించేశాడు. నలుగురు మగాళ్లతో తన భార్యకు అఫైర్లు ఉన్నాయనే అనుమానమే దీనికి కారణం. 36ఏళ్ల డెన్నిస్ ముమోను పోలీసులు అరెస్టు చేసి గృహ హింసతో పాటు పలు సెక్షన్లపై అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
అతని వివాహ సంబంధాన్ని కాపాడుకోవడమే తాను ఈ పని చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. తాను భార్యకు గుర్తు తెలియని వ్యక్తులకు మెసేజ్‌లు పంపడాన్ని గమనించాడు. వారికి తన భార్య పర్సనల్ ఫొటోలు కూడా పంపినట్లు ఉండటంతో అతని అనుమానం బలపడింది.
తాను బిజినెస్‌ట్రిప్‌లకు వెళ్తున్నప్పుడు తన భార్య వేరే వ్యక్తులను మీట్ అయిందనే విషయం తనకు తెలిసిందట. ఈ క్రమంలోనే బిజినెస్ ట్రిప్‌పై ర్వాండాకు వెళ్లే ముందు ప్రైవేట్ పార్ట్స్‌కు గమ్ము అంటించాడు. క్షణాల్లోనే మహిళకు ఇబ్బందిగా మారడంతో వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స అనంతరం ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.
పోలీసుల విచారణలోనూ తన భార్యకు నలుగురు మగాళ్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. నిందితుడి తరపు న్యాయవాది కోర్టులో భర్తను మోసం చేసినట్లు దానిపై న్యాయం కావాలని వాదించడంతో కోర్టుకు షాక్ వచ్చిన పనైంది. సోమవారానికి కేసును వాయిదా వేసింది.
Read More>> CAAని వెనక్కు తీసుకోవాలంటూ షహీన్ బాగ్ నుంచి అమిత్ షా ఇంటికి ర్యాలీ, విష్ణు మై వాలెంటైన్ – రిలేషన్ కన్ఫర్మ్ చేసిన జ్వాల గుత్తా