Husband commmits suicide : భార్య, అత్తింటి వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం

సంసారం అన్నాక గొడవలుంటాయి... సర్దుబాట్లు ఉంటాయి. కానీ అవి ముదురి పాకాన పడితేనే కోర్టులు పోలీసు స్టేషన్లు దాకా వెళతాయి. వైవాహిక జీవితంలో గొడవలు మొదలై అత్తింటివారి వేధింపులు భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు.

Husband commmits suicide atttempt due to harassment by wife : సంసారం అన్నాక గొడవలుంటాయి… సర్దుబాట్లు ఉంటాయి. కానీ అవి ముదురి పాకాన పడితేనే కోర్టులు పోలీసు స్టేషన్లు దాకా వెళతాయి. వైవాహిక జీవితంలో గొడవలు మొదలై అత్తింటివారి వేధింపులు భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు.  పోలీసులు అతడ్ని సమయానికి రక్షించిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.

రైల్వే కోడూరు పట్టణంలోని రాంనగర్ కు చెందిన బుర్రు లింగేశ్వర యాదవ్(41) బెంగుళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అతని సోదరుడు వెంకటరమణయ్య కోడూరులోనే లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు.

లింగేశ్వర్ తన సహోద్యోగి అయిన యువతిని 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంత కాలం క్రితం భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తాయి. గొడవలు రానురాను ఎక్కువ కావటంతో అతని భార్య…..లింగేశ్వర్ అతని కుటుంబ సభ్యులపై కోడూరు పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. ఈ కేసులో వారు ముందుస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

భార్య పిల్లల్ని తీసుకుని తన పుట్టింటికి తిరుపతికి వెళ్లిపోయింది. పెద్ద మనుషులసమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినా వీరి కాపురం కుదుట పడలేదు. ఈ క్రమంలో ఏప్రిల్ 10 వ తేదీన లింగేశ్వర్ భార్య రైల్వే కోడూరులోని భర్త ఇంట్లోకి తన అనుచరులతో ప్రవేశించి విలువైన వస్తువులు బంగారం తీసుకెళ్లింది. బాధితులువెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈవిషయమై చర్చిచేందుకు లింగేశ్వర్ ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం తిరుపతిలోని అత్తారింటికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందోఏమో కానీ సోమవారం ఉదయం నేను చనిపోతున్నానని అంటూ తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు.  ఇది చూసిన అతని సోదరుడు  వెంకట రమణయ్య వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు.

కొందరు కానిస్టేబుళ్లను తిరుపతికి పంపించి అతని భార్య, వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సాంకేతిక  అంశాల ఆధారంగా లింగేశ్వర్ ఎక్కడ ఉన్నాడో ఆచూకి గుర్తించారు. జీపీఎస్ ఆధారంగా ఫోన్ ఎక్కడి నుంచి ఉపయోగిస్తున్నాడో ట్రేస్ చేశారు. ఈలోగా లింగేశ్వర్ ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది.

చివరిసారిగా ఫోన్ నెల్లూరు జిల్లాలోని రాపూరు లో పనిచేసినట్లు  తెలుసుకున్నారు. అక్కడ వారికి బంధువులు ఉన్నారు.   వారి ఇళ్లకేమైనా వచ్చాడా అని ఫోన్లు చేయించగా .. అక్కడకు  రాలేదని వారు చెప్పారు. ఆ ఊరిలోని లాడ్డిల్లో పోలీసులు వెతికించారు. అప్పుడు ఒక లాడ్జిలో లింగేశ్వర్ యాదవ్ ఉన్నట్లు గుర్తించారు.

అప్పటికే అతను  నిద్రమాత్రలు తీసుకుని అపస్మారక  స్ధితిలోకి చేరుకున్నాడు. పోలీసులు అతడ్ని వెంటనే ఒక ప్రైవేట్ ఆస్పత్రకి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేయించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి తరలించారు. లింగేశ్వర్ ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు