Husband killed drunk wife : మద్యం సేవించిన భార్య – హత మార్చిన భర్త
భార్య మద్యం సేవించటంతో ఆగ్రహించిన భర్త అభ్యంతరం చెప్పాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. క్షణికావేశంలో భర్త భార్యను హతమార్చిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.

Drunken Wife,killed By Husband
Husband killed drunk wife in Visakha distric : భార్య మద్యం సేవించటంతో ఆగ్రహించిన భర్త అభ్యంతరం చెప్పాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. క్షణికావేశంలో భర్త భార్యను హతమార్చిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని అరకు మండలం పూజారిపట్టు గ్రామానికి చెందిన మర్రి శోభన్(30) భార్యమర్రి తులసి(24) ఏడాది కాలంగా మాతుమూరు లోని ఓ రైతుకు చెందిన పామాయిల్ తోటలో పనిచేస్తూ జీవిస్తున్నారు.
మార్చి27 శనివారం తులసి తన తల్లితో కలిసి సాలూరు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మద్యం సేవించి వచ్చింది. ఈ విషయమై భార్యా భర్తలమధ్య ఘర్షణ జరిగింది. మాటామాటా పెరిగింది. భార్యా భర్తలిద్దరూ గొడపడుతూనే…. తాము పనిచేస్తున్న జామాయిల్ తోటలోకి వెళ్ళారు.
అప్పటికి కోపం పెరిగిపోయిన భర్త అక్కడున్న కర్ర తీసుకుని భార్య మొహంపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకుతీవ్ర గాయం అయిన తులసి అక్కడికక్కడే మరణించింది. సమచారం తెలుసుకున్న సాలూరు సీఐ ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.