అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

ఖమ్మం జిల్లాలో అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. మధిర మండలం రాయపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

  • Published By: veegamteam ,Published On : February 2, 2020 / 02:41 AM IST
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

Updated On : February 2, 2020 / 2:41 AM IST

ఖమ్మం జిల్లాలో అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. మధిర మండలం రాయపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లాలో అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. మధిర మండలం రాయపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం…రాయపట్నం గ్రామానికి చెందిన తేళ్ల వెంకటప్రసాద్‌, శ్రీలతలకు పదిహేనేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి సాయి, స్వాతి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో భర్త వెంకటప్రసాద్‌ కొంతకాలంగా తరచూ ఆమెతో గొడవ పడుతున్నాడు. 

ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి ఒకే ఇంట్లో వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం (ఫిబ్రవరి 1, 2020) ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్త వెంకటప్రసాద్‌..భార్య శ్రీలత(35)ను గొంతు నులిమి చంపేశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. 

సమాచారం తెలుసుకున్న మధిర సీఐ, ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. బంధువులను అడిగి సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.