అంతా 48 గంటల్లోనే : భార్య ఆత్మహత్య.. లండన్ నుంచి వచ్చిన భర్త కూడా సూసైడ్

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం జొన్నతాళిలో విషాదం నెలకొంది. భర్తపై కోపంతో భార్య ఆత్మహత్య చేసుకోగా.. విషయం తెలిసిన భర్త కూడా ఆందోళనతో మరుసటి రోజే రైలు కింద

  • Published By: veegamteam ,Published On : September 1, 2019 / 01:03 PM IST
అంతా 48 గంటల్లోనే : భార్య ఆత్మహత్య.. లండన్ నుంచి వచ్చిన భర్త కూడా సూసైడ్

Updated On : September 1, 2019 / 1:03 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం జొన్నతాళిలో విషాదం నెలకొంది. భర్తపై కోపంతో భార్య ఆత్మహత్య చేసుకోగా.. విషయం తెలిసిన భర్త కూడా ఆందోళనతో మరుసటి రోజే రైలు కింద

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం జొన్నతాళిలో విషాదం నెలకొంది. భర్తపై కోపంతో భార్య ఆత్మహత్య చేసుకోగా.. విషయం తెలిసిన భర్త కూడా ఆందోళనతో మరుసటి రోజే రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. 48  గంటల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం రెండు కుటుంబాల్లోనూ విషాదం నింపింది. దంపతుల మధ్య తలెత్తిన చిన్న వివాదం ఇద్దరి ప్రాణాలు తీసింది. ఇప్పుడు వారి 10నెలల చిన్నారి అనాథగా మారింది. 

జొన్నతాళిలో ఆగస్టు 29న రాత్రి మెట్టెల రమాదేవి(24) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని లండన్‌లో ఉన్న భర్త గంగయ్యకు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆందోళనకు గురైన గంగయ్య  శుక్రవారం సాయంత్రానికి లండన్‌ నుంచి శంషాబాద్ కి వచ్చాడు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కి చేరుకున్నాడు. శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు జొన్నతాళిలోని కుటుంబసభ్యులతో ఫోన్‌లో  మాట్లాడాడు. తనపై మార్టూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు ఉందని, ఉద్యోగం కోసం లండన్‌ వెళ్లే అవకాశం తనకిక ఉండదని వాపోయాడు. నేను చనిపోతానని బంధువులతో ఫోన్‌లో చెప్పాడు. ఆ తర్వాత రైలు కింద పడి  చనిపోయాడు.

రాత్రి 11 గంటల నుంచి గంగయ్య ఫోన్ కి బంధువులు ఎంత ప్రయత్నించినా ఫోన్‌ రింగ్ అవుతోంది కానీ సమాధానం లేదు. దీంతో ఆందోళన చెందిన వారు శనివారం మార్టూరు పోలీసులను సంప్రదించారు.  ఇంతలో సికింద్రాబాద్‌ రైల్వే పోలీసుల నుంచి మార్టూరు పోలీసులకు సమాచారం వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్‌ ఫామ్ లో రైలు కిందపడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని… అతని ఆధార్‌, ఫొటో, ఫోన్‌ నెంబర్ ఆధారంగా గంగయ్యగా గుర్తించామని తెలిపారు. భార్యను చివరిసారి చూసేందుకు గంగయ్య వస్తాడని ఎదురుచూసిన కుటుంబసభ్యులు, బంధువులు ఈ వార్తతో షాకయ్యారు. గంగయ్య సూసైడ్ చేసుకున్నాడని తెలిసి కన్నీరుమున్నీరయ్యారు. 

మార్టూరు మండలం జొన్నతాళికి చెందిన రమాదేవి (27), మెట్టెల గంగయ్య(34) సైన్స్‌లో పీజీ చేశారు. ఒకే ఊరి వాళ్లు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆ వెంటనే  ఉద్యోగం కోసం సౌదీ వెళ్లి రెండేళ్లు అక్కడే ఉన్నారు. 10 నెలల క్రితం రమాదేవి పుట్టింట్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో లండన్‌లో మంచి ఉద్యోగం రావడంతో గంగయ్య అక్కడికి వెళ్లాడు. నెల రోజుల క్రితం భార్య, బిడ్డలను చూసేందుకు స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలోనే దంపతులిద్దరి మధ్య గొడవలు జరిగాయని, భార్యను పీహెచ్‌డీ చేయాలని గంగయ్య కోరగా అందుకు ఆమె తిరస్కరించిందని కుటుంబసభ్యులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం కూడా ఈ విషయంపైనే ఇద్దరికీ గొడవలు జరిగాయన్నారు. గంగయ్య లండన్ తిరిగి వెళ్తూ పీహెచ్‌డీ చేస్తేనే తనతో తీసుకెళ్తానని, లేకపోతే పుట్టింట్లోనే ఉండిపోతావ్ అంటూ భార్యని హెచ్చరించి వెళ్లిపోయాడు. భర్త చేసిన హెచ్చరికతో తీవ్ర ఆవేదనకు గురైన రమాదేవి గురువారం (ఆగస్టు 29, 2019) ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంగయ్య లండన్ చేరుకోగానే బంధువులు ఈ విషయం ఫోన్ చేసి చెప్పడంతో అతడు షాకయ్యాడు. వెంటనే తిరుగుపయనమై శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాడు. అనూహ్యంగా రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. 48 గంటల వ్యవధిలోనే భార్య, భర్త చనిపోవడం గ్రామంలో విషాదం నింపింది. ఉన్నత చదువులు అభ్యసించి కూడా చిన్న విషయానికే రమాదేవి, గంగయ్య ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది.