Hydarabadi Rs. 70 lakhs losses in online rummy with fake gps : రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ రమ్మీ ఆటను నిషేధించినప్పటికీ కొందరు ఫేక్ జీపీఎస్ ఉపయోగించి రమ్మా ఆడుతూ లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన ఒక వ్యక్తి రూ.70 లక్షలు పొగొట్టుకుని లబోదిబోమంటున్నాడు. మోసపోయానని సీసీఎస్ పోలీసులను ఆశ్రయిస్తే అతడు చేసిన పనికి వాళ్లుకూడా చేతులెత్తేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 2017 లోనే ఆన్ లైన్ రమ్మీని నిషేదిస్తూ ఉ్తతర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన సైట్లు ఓపెన్ కాకుండా సాంకేతికంగా కూడా కట్టడి చేశారు. అయినా జూదానికి అలవాటు పడిన వారు ఫేక్ జీపీఎస్ లు ఉపయోగించి రమ్మీ ఆడుతున్నారు. అంబర్ పేటకు చెందిన వ్యక్తి కూడా హైదరాబాద్ లోకేషన్ కు రమ్మీ ఓపెన్ కాకపోవటంతో తాను బెంగుళూరులో ఉన్నట్లు నకిలీ జీపీఎస్ యాప్ లు వాడి రమ్మీ ఆడాడు.
ఈ యాప్ లతో హైదరాబాద్ లో ఉంటూ, లోకేషన్ ను బెంగుళూరు, ముంబై లో ఉన్నట్లు సెల్ ఫోన్ లో సెట్టింగ్స్ మార్చటంతో గేమ్ ఓపెన్ అవుతుంది. ఇలా నిబంధనలకు విరుధ్ధంగా ఆన్ లైన్ జూదం ఆడి పలువురు మోసపోతున్నారు, అంబర్ పేటకు చెందిన వ్యక్తి రెండేళ్లుగా రెండు నకిలీ ఐడీలతో ఆన్ లైన్ రమ్మీ ఆడుతున్నాడు. అప్పులు చేసి ఆన్ లైన్ లో పెట్టుబడులు పెట్టాడు. నష్టాలు రావటం మొదలైంది. రేపో మాపో లాభాలు వస్తాయనే ఆశతో రూ. 70 లక్షలు పెట్టుబడి పెచుతూ ఉన్నదంతా పోగోట్టుకున్నాడు. లబోదిబో మంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా..నకిలీ జీపీఎస్ ఉపయోగించి ఆన్ లైన్ లో రమ్మీ ఆడితే ఎలాంటి చర్యలు తీసుకోలేమని కేసు నమోదు చేసుకోకుండా పంపించి వేశారు.