Prostitution Racket : హైదరాబాద్‌లో వ్యభిచార గృహాలపై దాడులు

హైదరాబాద్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Prostitution Racket

Prostitution Racket :  హైదరాబాద్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు లోని రోడ్డు నెంబర్ 3లోని ఈ.డబ్ల్యూ.ఎస్ 154/1 ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తన్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి నిర్వాహకుడు నాగ వెంకటేశ్వర రావును అరెస్ట్ చేశారు.

నిందితుడు వద్దనుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి ప్రసాద్ రెడ్డి పరారీలో ఉన్నాడు. వీరిద్దరూ ఫోన్ లోనే ఆన్‌లైన్‌లోనే యువతుల ఫోటోలు పంపించి విటులను ఆకర్షించి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు యువతులను వేరే ప్రదేశంలో ఉంచి విటులు వచ్చినప్పుడు వారిని రప్పించి గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం సాగిస్తున్నారు. దీంతో పోలీసులు వలపన్ని వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Also Read : karnataka Night Curfew : కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

మరోక వ్యభిచార ముఠా… జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని…. సంజయ్‌ గాంధీనగర్‌కు చెందిన కటకం సాయి కుమార్‌ ఓ గదిని అద్దెకు తీసుకొని ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందటంతో ఆ ఇంటిపై దాడి చేసి సాయికుమార్‌తో పాటు ఇద్దరు మహిళలను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సాయికుమార్‌ను రిమాండ్‌కు పంపి మహిళలిద్దరిని రెస్క్యూ హోంకు తరలించారు.