Ts Tourisum Rape Attempt
Telangana Tourism : తెలంగాణ పర్యాటక శాఖ ఇంచార్జ్ ఎండీ పై నారాయణ గూడ పోలీస్ లు అత్యాచారం కేసు నమోదు చేసారు. ఎండీ మనోహరరావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో నాగార్జునసాగర్‌లో బోట్ యూనిట్ ప్రారంభోత్సవం కోసం అక్కడకు వెళ్లారు.
ఆ సమయంలో అక్కడ విజయ విహార్ గెస్ట్ హౌస్ లో హెల్పర్ గా పని చేస్తున్న షెడ్యూల్ తెగకు చెందిన మహిళపై లైంగిక వేధింపులు, అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని బాధిత మహిళా 2018 లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read : Akhilesh Yadav : మాపై బురద చల్లడానికే ఐటీ దాడులు-మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్
పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, ప్రస్తుతం తెలంగాణ టూరిజం ఇంచార్జి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న మనోహర్ రావుపై నారాయణగూడ పోలీసులు ఐపీసీ సెక్షన్ 354,354 (A) 3(w)(i), 3 (2)(V)(a) SC ST చట్టాల కింద కేసు నమోదు చేశారు.