Hyderabad Honey Trap Gang : హైదరాబాద్ లో కొత్త తరహా దాడులు జరుగుతున్నాయి. ముందుగా హోమ్ డెలివరీ పేరుతో యువకులతో ఓ మహిళ పరిచయాలు పెంచుకుని ఫోటోలు దిగుతుంది. ఆ తర్వాత హనీ ట్రాప్ చేసి తన ముఠాతో ఫోటోలు దిగిన వారిపై దాడులు చేయిస్తోంది. ఫోటోలు దిగిన మరుసటి రోజు వారి ఇంటి ముందు ఆ మహిళ హల్ చల్ చేస్తుంది.
ఇప్పటికే కొంతమంది యువకులను బెదిరించి వారి నుంచి రూ.8లక్షలు వసూలు చేసింది. హైదరాబాద్ లో హనీట్రాప్ దాడులపై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కరోజే సెంట్రల్ జోన్ పరిధిలో 6 కేసులు నమోదయ్యాయి. హనీట్రాప్ కేసులు పెరిగిపోతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
మోసాలకు పాల్పడుతున్న హనీ ట్రాప్ ముఠాను అరెస్ట్ చేశారు. హనీట్రాప్ కి పాల్పడ్డ మహిళ పరారీ కాగా, 12మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి లక్షన్నర రూపాయల నగదుతో పాటు 3 బైక్ లు, 12 ఫోన్లు, పది కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.