Hyderabad: భాగ్యనగరంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి.. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి

హైదరాబాద్‌లోని తార్నాకలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని రూపాలి అపార్ట్‌మెంట్‌లో వీరు నివాసం ఉంటున్నారు. నలుగురు అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: భాగ్యనగరంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి.. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి

Crime news in hederabad

Hyderabad: పండుగ పూట భాగ్యనగరంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పందంగా మృతిచెందారు. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. స్థానిక పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని నలుగురు మృతికిగల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Crime News: భార్యతో గొడవ పడి.. 3వ అంతస్తు నుంచి రెండేళ్ల కొడుకుని తోసేసి, తానూ దూకేసిన తండ్రి

హైదరాబాద్‌లోని తార్నాకలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని రూపాలి అపార్ట్‌మెంట్‌లో వీరు నివాసం ఉంటున్నారు. ప్రతాప్ అనే వ్యక్తి చెన్నైలోని బీఎండబ్ల్యూ కార్ల షోరూంలో డిజైనర్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, సింధూర హిమాయత్ నగర్ లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిన్నటి నుంచి ఎవరూ బయటకు రాకపోవటంతో స్థానికులు తలుపులు తట్టిచూశారు. అయినా ఎవరూ స్పందించక పోవటంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.

Crime News: భార్య మృతదేహాన్ని పెట్టెలో పెట్టుకొని 284 కి.మీ దూరం వెళ్లిన భర్త.. అక్కడ ఏం జరిగిందంటే..?

అపార్ట్మెంట్లోని వారి నివాసం వద్దకు వెళ్లిన పోలీసులు స్థానిక సహకారంతో బలవతంగా డోర్ తీసి‌చూడగా అప్పటికే ఇంట్లోనివారు మృతిచెంది ఉన్నారు. మృతుల్లో ప్రతాప్ (34), అతని భార్య సింధూర (32), కుమార్తె ఆద్య (4), ప్రతాప్ తల్లి రాజతిగా గుర్తించారు. నలుగురు మరణించినట్లు నిర్ధారించుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు వీరి మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. అయితే వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణంగా ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. చిన్నారిని చంపిన అనంతరం దంపతులు, ఆ తర్వాత రజతి మృతిచెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.