Crime News: భార్య మృతదేహాన్ని పెట్టెలో పెట్టుకొని 284 కి.మీ దూరం వెళ్లిన భర్త.. అక్కడ ఏం జరిగిందంటే..?

భార్యను హత్యచేసిన ఓ వైద్యుడు మూడోకంటికి తెలియకుండా తన తండ్రితో కలిసి అంత్యక్రియలు పూర్తిచేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో మృతదేహాన్ని పెట్టెలో పెట్టుకొని 284 కిలో మీటర్ల దూరం వెళ్లాడు.. అయితే చివరికి వారు పోలీసులకు పట్టుబడటంతో కటకటాల పాలయ్యారు.

Crime News: భార్య మృతదేహాన్ని పెట్టెలో పెట్టుకొని 284 కి.మీ దూరం వెళ్లిన భర్త.. అక్కడ ఏం జరిగిందంటే..?

Murder Case

Crime News: భార్యను హత్యచేసిన ఓ వైద్యుడు మూడోకంటికి తెలియకుండా తన తండ్రితో కలిసి అంత్యక్రియలు పూర్తిచేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో మృతదేహాన్ని పెట్టెలో పెట్టుకొని 284 కిలో మీటర్ల దూరం వెళ్లాడు.. అయితే చివరికి వారు పోలీసులకు పట్టుబడటంతో కటకటాల పాలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Madhya Pradesh: వీడి ఐడియా తగలయ్య..! పాము కాటుతో భార్యను హతమార్చాలని చూసిన భర్త.. చివరికి అతని మెడకే చెట్టుకుంది..

డాక్టర్ అశుతోష్ అవస్తీ, డాక్టర్ వందనా శుక్లాతో 2014లో వివాహం జరిగింది. వీరిద్దరూ బీఎంఎస్ వైద్యులు. లఖింపూర్ నగరం నుండి సీతాపూర్ రోడ్డులో గౌరీ అనే ఆస్పత్రిని ప్రారంభించి, వైద్యసేవలు అందిస్తున్నారు. వీరి జీవితం అన్నోన్యంగా సాగుతున్న క్రమంలో 2018లో అశుతోష్ అవస్థి ఇంటిపైకప్పు నుంచి కిందపడటంతో వెన్నుకు బలమైన గాయమైంది. ఆ తరువాత అతనికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వివాదాలు మొదలయ్యాయి. 2020లో వందన టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా కవలలకు జన్మనిచ్చింది. అయినా భార్యాభర్తల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. గతనెల 26న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అశుతోష్ భార్య వందన తలపై బలంగా కొట్టడంతో ఆమె మరణించింది.

Madhya Pradesh: పోకిరి మూవీలాగా మహిళా కానిస్టేబుల్ అండర్ కవర్ ఆపరేషన్.. ఎందుకంటే

విషయాన్ని తండ్రికి చెప్పడంతో తండ్రి సహాయంతో మృతదేహాన్ని పెట్టెలో పెట్టి నగరం బయటఉన్న వారి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్ సహాయంతో 284 కిలో మీటర్లు ప్రయాణించి గర్ ముక్తేశ్వర్ వద్ద రూ. 1300 టోకెన్ తీసుకొని గంగానది ఒడ్డున అంత్యక్రియలు జరిపారు. ఆ తరువాత లఖింపూర్ ఖేరీ పోలీస్స్ స్టేషన్‌లో తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసలుు విచారణలో భాగంగా అశుతోష్ పై అనుమానం వచ్చింది. స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అశుతోష్, అతని తండ్రిని అరెస్ట్ చేశారు.