Fake Certificate Racket : నకిలీ సర్టిఫికెట్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్‌లో యుూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముషీరాబాద్ పోలీసులు, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త

Fake certificate Racket

Fake Certificate Racket :  హైదరాబాద్‌లో యుూనివర్సిటీల  నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న  ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముషీరాబాద్ పోలీసులు, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

వారి వద్దనుంచి వివిధ కళాశాలలకు చెందిన రబ్బరు స్టాంపులు, ప్రభుత్వ కార్యాలయాలు… ఫోర్జరీ పత్రాల కోసం ఉపయోగించబడిన  40 సర్టిఫికెట్స్  సీజ్ చేశారు.  మధ్య ప్రదేశ్  లోని  SRK విశ్వవిద్యాలయం  నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు,జిరాక్స్ సర్టిఫికెట్లు 6 సీజ్ చేశారు.5 సెల్ ఫోన్లు, 2 కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ రాకెట్‌లో  ప్రధాన నిందితుడైన తట్టపల్లి రవికాంత్ రెడ్డి కన్సల్టెన్సీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతను మహమ్మద్ ఆసిఫ్ అలీతో కలిసి ఈ దందా నిర్వహిస్తున్నాడు. వీరితో మధ్యప్రదేశ్‌.. భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ విశ్వవిద్యాలయం (SRKU) అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉప్పరి రంగరాజు,కేతన్ సింగ్‌లు చేతులు కలిపారు.

రవికాంత్ రెడ్డి.. ఆసిఫ్ అలీ లు కాలేజీల నుండి డ్రాపౌట్, బ్యాక్‌లాగ్స్, ఫెయిల్ అయిన విద్యార్థుల సమాచారాన్ని సేకరిస్తూ, అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులను ట్రాప్ చేసి, వారికి భోపాల్‌ లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్శిటీ నుండి B.Tech, B.Sc, B.Com సర్టిఫికేట్‌లను అందజేస్తామని చెప్పి వారి వద్దనుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
Also Read : Ganja Smuggling : భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి గంజాయి వ్యాపారం
B.Tech సర్టిఫికేట్‌ల కోసం రూ.3,00,000/-, Bsc., ఇతర సర్టిఫికెట్ల కోసం రూ.1,50,000/-లు ఈముఠా వసూలు చేస్తోంది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు.