Rapido bike rider
Rapido : హైదరాబాద్ లో అమ్మాయిలను వేధిస్తున్న ర్యాపిడో బైక్ డ్రైవర్ ను షీ టీమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయకుమార్ అనే వ్యక్తి తన బైక్‌తో ర్యాపిడో బైక్ రైడర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వచ్చిన బుకింగ్స్ ప్రకారం ప్రజలను బైక్ పై ఎక్కించుకుని వారు కోరిన చోట దింపుతూ ఉండేవాడు.
ఈక్రమంలో అతని బైక్ ఎక్కిన కొంత మంది కాలేజీ అమ్మాయిలకు నరకం చూపించాడు. వారి స్మార్ట్ ఫోన్లకు అర్ధనగ్న ఫోటోలు పంపించి వారిని వేధించసాగాడు. దీంతో 8 మంది బాధిత మహిళలు షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న షీ టీమ్స్ పోలీసులు నిందితుడు విజయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం ఇద్దరు నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. కామవాంఛతోనే ఈ విధంగా ఆడపిల్లల్ని వేధిస్తున్నట్లు నిందితుడు పోలీసు విచారణలో అంగీకరించాడు. నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Also Read : Madhya Pradesh : వివాహేతరం సంబంధంపై అనుమానం-స్నేహితుడిని చంపి పూడ్చిపెట్టిన జంట