Ias Officers Appeal To Dgp
Gone Prakash Rao : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఇటీవల టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో గోనె ప్రకాష్ రావు వ్యాఖ్యలపై చట్టం ప్రకారం అవసరమైన చర్యను ప్రారంభించాలని ఐఏఎస్ అధికారుల సంఘం డీజీపీని కోరింది.
Also Read :Ganja Fields : విశాఖ మన్యంలో 49 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
గోనే ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు కలెక్టర్ హోదా విలువను తగ్గించడమే కాకుండా మహిళా అధికారి గౌరవాన్ని కించపరిచేలా ఉందని వారు అన్నారు. మారుమూల జిల్లాలో పనిచేస్తున్న ఓ సిన్సియర్ ఆఫీసర్‌పై రాజకీయ ప్రముఖుడు ఇలాంటి ప్రకటన చేయడం ఆమెను మాత్రమే కాకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులందరినీ నిరుత్సాహానికి గురిచేస్తుందని అసోసియేషన్ డీజీపీకి రాసిన లేఖలో అభిప్రాయపడింది. మహిళా అధికారికి వ్యతిరేకంగా చేసిన అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు చట్టం ప్రకారం అవసరమైన చర్యను ప్రారంభించాలని అసోసియేషన్ డీజీపీని అభ్యర్థించింది.