Indian Techie : ఉద్యోగం పోవటంతో..కుటుంబాన్ని హత్యచేసిన టెక్కీకి జీవిత ఖైదు

చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం పోవటంతో కుటుంబంలో ఆర్ధిక సమస్యలు మొదలయ్యాయి.

Life Sentenced to Indian Techie : చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం పోవటంతో కుటుంబంలో ఆర్ధిక సమస్యలు మొదలయ్యాయి. కుటుంబాన్ని పోషించే ధైర్యంలేక భార్యాపిల్లలను హత్య చేసిన  భారత సంతతి టెక్కీకి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది.

కాలిఫోర్నియా జంక్షన్ బౌలేవార్డ్‌లోని వుడ్‌క్రీక్ వెస్ట్ కాంప్లెక్స్ వద్ద రోజ్‌విల్లే అపార్ట్‌మెంట్‌లో భారత సంతతికి చెందిన   స్టాఫ్‌వేర్‌ ఇంజినీర్‌ శంకర్‌ నాగప్ప(55) భార్య ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. 2019 లో అతనికి ఉద్యోగం పోయింది. మరో ఉద్యోగం వెతుక్కునే లోపు   కుబుంటంలో ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.
Also Read : Bus Accident : తప్పిన ప్రమాదం-బస్సు బోల్తా-పలువురికి గాయాలు
కుటుంబానికి ఆధారంగా ఉండాల్సిన శంకర్ కుటుంబాన్ని పోషించలేనని అధైర్య పడ్డాడు. దీంతో భార్యా పిల్లలను హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు.  2019 అక్టోబర్ 7వ తేదీన  మొదట భార్య జ్యోతి(46), కుమార్తె గౌరి(16) చిన్న  కుమారుడు నిశ్చల్(13)ని అపార్ట్‌మెంట్‌లోనే హత్య చేశాడు. అనంతరం 13వ తేదీన రోజ్ విల్లే, మౌంట్ శాస్తా మార్గ్ లో 20 ఏళ్ళ పెద్ద కొడుకు వరుణ్ ను హత్యచేశాడు.  కుమారుడి శవాన్ని తీసుకుని 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ శాస్తా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

తన కుటుంబ సభ్యులను హత్యచేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కారులోని కొడుకు మృతదేహాన్ని   ఆస్పత్రికి తరలించి…. ఇంటికివెళ్లి అపార్ట్ మెంట్ లోని మిగతా కుటుంబ సభ్యుల మృతదేహాలను గుర్తించారు. శంకర్ నాగప్పను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కేసు కోర్టులో విచారణకు వచ్చింది.

Also Read : AP Covid Update : ఏపీలో కొత్తగా 262 కోవిడ్ కేసులు నమోదు

అప్పట్లో ఈ హత్యలు అమెరికాలో కలకలం రేపాయి. కేసు విచారణ సందర్భంగా ఈ హత్యలు తాను చేయలేదంటూ… తానునిర్దోషినంటూ నాగప్ప పిటీషన్ వేశాడు. అయితే గత నెలలో తన మనసు మార్చుకుని వేరే పిటీషన్ వేశాడు. తన ముగ్గురు పిల్లలను హత్య చేయటంతో పాటు భార్య ఆత్మహత్యకు తానే కారణమని పిటీషన్ లో పేర్కోన్నాడు. ఈ కేసుపై విచారణ జరిపిన ప్లేసర్ కౌంటీ కోర్టు శంకర్ నాగప్పకు పెరోల్ వీలులేని జీవితఖైదు విధించింది.

ట్రెండింగ్ వార్తలు