Bus Accident : తప్పిన ప్రమాదం-బస్సు బోల్తా-పలువురికి గాయాలు
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పరిధిలోని గుర్రంగట్టు తాండ చౌరస్తా దగ్గర ఆర్టీసీ బస్సు ఈ రోజు ఉదయం బోల్తాపడింది. ఈఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

Tsrtc Bus Overturn At Vikarabad District
Bus Accident : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పరిధిలోని గుర్రంగట్టు తాండ చౌరస్తా దగ్గర ఆర్టీసీ బస్సు ఈ రోజు ఉదయం బోల్తాపడింది. ఈఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
సంగారెడ్డి నుంచి 60 మంది ప్రయాణికులతో తాండూరు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు మర్పల్లి మండలం కలకోట గ్రామం సమీపంలో ఓ తండా మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. గాయపడిన వారిని రాయికల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read : Gold Sales : దీపావళికి 50 టన్నుల బంగారం కొన్నారు
డ్రైవర్ అతివేగంగా బస్సు నడపటమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. కలకోట గ్రామం సమీపంలో రోడ్డుపై ఉన్న ఎత్తుపల్లాలను డ్రైవర్ అంచనా వేయలేకపోయాడు. అప్పటికే వేగంలో ఉన్న బస్సును కంట్రోల్ చేయలేకపోవటంతో…. బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఒక్కసారిగా బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. కొంత సేపు ఆ ప్రాంతమంతా.. భయాందోళనలకు గురైన ప్రయాణికుల హాహాకారాలతో మార్మోగిపోయింది.