AP Covid Update : ఏపీలో కొత్తగా 262 కోవిడ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 262 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 229 మంది కోలుకున్నారు.

Ap Covid Cases Update
AP Covid Update : ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 262 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 229 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3 వేల 227 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 69వేల 614 కి చేరింది. వీరిలో 20 లక్షల 51 వేల 976 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏపీలో గత 24 గంటల్లో ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు కృష్ణా, మరోకరు శ్రీకాకుళం జిల్లా వాసులు.
Also Read : Bus Accident : తప్పిన ప్రమాదం-బస్సు బోల్తా-పలువురికి గాయాలు
ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14 వేల 411కు చేరింది. నిన్నటివరకు రాష్ట్రంలో 2 కోట్ల 99లక్షల 17వేల 592 మంది శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Ap Covid Updates