IndiGo Flight Threatened :పేల్చివేస్తామంటూ ఇండిగో విమానానికి బెదిరింపు.. ముంబై విమానాశ్రయంలో కలకలం

ముంబై విమానాశ్రయంలో కలకలం రేగింది. బాంబులతో పేల్చివేస్తామంటూ ఇండిగో విమానానికి బెదిరింపు వచ్చింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక ఈ మెయిల్‌ వచ్చింది. ఇండిగో విమానాన్ని పేల్చివేసేందుకు అందులో బాంబు అమర్చినట్లు అందులో ఉంది.

IndiGo Flight Threatened : ముంబై విమానాశ్రయంలో కలకలం రేగింది. బాంబులతో పేల్చివేస్తామంటూ ఇండిగో విమానానికి బెదిరింపు వచ్చింది. ఇండిగోకు చెందిన 6E 6045 నెంబర్‌ గల విమానం శనివారం రాత్రి ముంబై నుంచి అహ్మదాబాద్‌ వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంతలోనే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక ఈ మెయిల్‌ వచ్చింది. ఇండిగో విమానాన్ని పేల్చివేసేందుకు అందులో బాంబు అమర్చినట్లు అందులో ఉంది.

విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైనట్లు ఇండిగో సంస్థ పేర్కొంది. బాంబు బెదిరింపుకు సంబంధించిన అన్ని నియమాలు, పద్ధతులను పాటించినట్లు పేర్కొంది. తనిఖీ తర్వాత బాంబు బెదిరింపు ఉత్తదేనని తేలినట్లు తెలిపింది. అనంతరం విమానం అహ్మదాబాద్‌కు టేకాఫ్‌ అయినట్లు వెల్లడించింది.

Delhi IGI Airport: ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించారు. ముంబై విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే విమానాశ్రయానికి అందిన బాంబు బెదిరింపు ఈ మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు