Delhi IGI Airport: ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

Delhi IGI Airport: ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Delhi Igi Airport

Updated On : June 14, 2021 / 12:12 PM IST

Delhi IGI Airport: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఎయిర్ పోర్ట్ మొత్తం తనిఖీలు చేపట్టినా బాంబు దొరలేదు దీంతో ఫేక్ కాల్ గా నిర్దారించారు.

అనంతరం విచారణ చేపట్టి ఆకాష్ దీప్ అనే వ్యక్తి కాల్ చేసినట్లుగా గుర్తించారు. అతడు ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి పాట్నా వెళ్తున్న విమానంలో తండ్రితోపాటు ఎక్కాడు. ఆకాష్ దీప్ ను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.