Drug Gang Arrested: అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠా అరెస్ట్.. ఐటీ ఉద్యోగులే టార్గెట్.. రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి సప్లయ్..

భాయ్ బచ్చా agayaa కోడ్ మెసేజ్ తో సంప్రదింపులు జరిపారు. 2 గంటల వ్యవధిలో 14 మంది కన్జ్యూమర్లను గుర్తించారు.

Drug Gang Arrested: అంతర్ రాష్ట్ర డ్రగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా ఓపియం స్వాధీనం చేసుకున్నారు. 45 రోజుల పాటు నిఘా ఉంచి అంతరాష్ట్ర డ్రగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. రాజస్థాన్ నుండి ఓపియంతో పాటు ఎంఫిటమైన్ డ్రగ్ ను తెలంగాణకు సరఫరా చేస్తోంది ముఠా. రాజస్థాన్ నుండి ఒక క్రెటా కారులో డ్రగ్స్ ను హైదరాబాద్ కు తరలించారు.

ముఠాను పట్టుకునేందుకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు అన్ని టోల్ ప్లాజాల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. బోయిన్ పల్లికి వచ్చాక అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సల్వారం బిశ్నోయ్, హపురాo, లాలారం బిష్ణోయ్ లను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. కన్జ్యూమర్లలో ఐదుగురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ఒక డెంటల్ టెక్నీషియన్, ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించిన ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అటు.. గచ్చిబౌలిలోని ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా డ్రగ్స్, గంజాయి సప్లయ్ జరుగుతోంది. గచ్చిబౌలి హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరిసరాల్లో గంజాయి విక్రయాలు చేస్తున్న సందీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు గంజాయి తీసుకొస్తున్నాడు. దాదాపు 100 ప్యాకెట్లకుపైగా గంజాయి విక్రయాలు జరిగినట్లు గుర్తించారు. సందీప్ దగ్గర వంద మందికి పైగా ఐటీ ఉద్యోగుల డేటా బేస్ ఉంది. నిత్యం గచ్చిబౌలిలో మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

డ్రగ్ పెడ్లర్ వాట్సాప్ ద్వారా కన్జ్యూమర్లతో కాంటాక్ట్ లో ఉంటున్నాడు. భాయ్ బచ్చా agayaa కోడ్ మెసేజ్ తో సంప్రదింపులు జరిపారు పోలీసులు. రెండు గంటల వ్యవధిలో 14 మంది కన్జ్యూమర్లను గుర్తించింది ఈగల్ టీమ్. గంజాయి కొనేందుకు నాలుగు సంవత్సరాల బాబును తీసుకొచ్చారు భార్యా భర్తలు. భార్యాభర్తలు గంజాయికి బానిసలుగా మారినట్లు పోలీసులు గుర్తించారు.