అమెరికాలో కాల్పుల కలకలం : ఆరుగురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. న్యూజెర్సీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. న్యూజెర్సీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. న్యూజెర్సీలోని ఓ సూపర్ మార్కెట్ లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. మంగళవారం(డిసెంబర్ 10,2019) మధ్యాహ్నం కొషర్ సూపర్ మార్కెట్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు.. పోలీసులు, పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ లో ఆరుగురు చనిపోయారు. వీరిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నాడు. దుండగులను పోలీసులు కాల్చి చంపారు.
జెవిష్ కమ్యూనిటీ వారు ఎక్కువగా ఈ మార్కెట్ కు వస్తుంటారు. జనాలు ఎక్కువగా ఉన్న సమయంలో దుండగులు ఫైరింగ్ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగులు హతమయ్యారు. అయితే వారు ఎవరు? ఎందుకు కాల్పులు జరిపారు? అనేది తెలియాల్సి ఉంది. ఈ కాల్పులతో న్యూజెర్సీ వాసులు ఉలిక్కిపడ్డారు.
ఈ మధ్య కాలంలో అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువైంది. గన్ కల్చర్ కారణంగా స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని వర్రీ అవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. కొందరు మతం పేరు ఉన్మాదానికి తెగబడుతున్నారు. వరుస కాల్పుల ఘటనలు స్థానికులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.