Judo Coach Harassment : మూడు రాత్రులు నాతో గడపాలి, నా కోరిక తీర్చాలి.. జూడో కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
అర్ధరాత్రి మద్యం తాగిన శ్యామ్యూల్ తమతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు చేశారు. మూడు రాత్రులు తనతో గడపాలని బెదిరించినట్లు విద్యార్థులు వాపోయారు. మద్యం తాగుతూ గ్లాస్ లో మందు పోయాలంటూ తమను వేధించాడన్నారు. తన కోరిక తీరిస్తే స్పోర్ట్స్ లో ఉన్నత స్థాయికి తీసుకెళ్తానంటూ కోచ్ రాజు తమతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు.
- Naveen
- Updated on- February 18, 2023 / 04:43 PM IST
Judo Coach Harassment : జూడో కోచ్ శ్యామ్యూల్ రాజు వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. కోచ్ శ్యామ్యూల్ తమను లైంగికంగా వేధించాడంటూ జూడో స్పోర్ట్స్ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైజాగ్ విద్యార్థులు, కోచ్ శ్యామ్యూల్ రాజు జూడో నేషనల్ మ్యాచ్ కోసం చెన్నై వెళ్తున్నారు. విజయవాడలో మెడికల్ టెస్టుల కోసం ఆగారు. అయితే, ట్రైన్ మిస్ అవ్వటంతో విద్యార్థులను స్టేట్ జూడో ఇన్ స్టిట్యూట్ కు తీసుకెళ్లాడు కోచ్ శ్యామ్యూల్. అక్కడ శ్యామ్యూల్ కామంతో రెచ్చిపోయాడని విద్యార్థులు ఆరోపించారు.
అర్ధరాత్రి మద్యం తాగిన శ్యామ్యూల్ తమతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు చేశారు. మూడు రాత్రులు తనతో గడపాలని బెదిరించినట్లు విద్యార్థులు వాపోయారు. మద్యం తాగుతూ గ్లాస్ లో మందు పోయాలంటూ తమను వేధించాడన్నారు. తన కోరిక తీరిస్తే స్పోర్ట్స్ లో ఉన్నత స్థాయికి తీసుకెళ్తానంటూ కోచ్ రాజు తమతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. అంతేకాదు.. లైట్స్ ఆఫ్ చేసి చేతులు వెయ్యటంతో ఇద్దరు విద్యార్థులు భయపడిపోయారు. ఆ ఇద్దరు మైనర్ విద్యార్థులు ఐదేళ్ళుగా కోచ్ వద్దే ట్రైన్ అవుతున్నారు. గతంలోనూ కోచ్ శ్యామ్యూల్ పలుమార్లు ఇలానే లైంగికంగా వేధించాడని విద్యార్థులు చెబుతున్నారు.
లైంగిక వేధింపుల గురించి ఎవరికైనా చెబితే మీ లైఫ్ స్పాయిల్ అవుతుందని కోచ్ శ్యామ్యూల్ తమను బెదిరించాడని విద్యార్థులు కన్నీటిపర్యంతం అయ్యారు. బెజవాడ వచ్చాక రూమ్ లో కోచ్ హింస మరింత పెరిగిపోవటంతో విద్యార్థులు భరించలేకపోయారు. అర్ధరాత్రి 100 కు డయల్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కోచ్ శ్యామ్యూల్ రాజును అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా, విద్యార్థులు తమ తల్లిదండ్రులతో చెన్నై మ్యాచ్ కు వెళ్లారు.
