MLA Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు మాజీ సర్పంచ్‌ భర్త కుట్ర..భార్యను పదవి నుంచి తప్పించడంతో కక్ష!

టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కుట్ర కేసు కలకలం రేపుతోంది. ఆర్మూర్ నియోజక వర్గం పరిధిలోని మక్లూర్ మండలం కల్లాడి గ్రామ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ ప్లాన్ రూపోందించాడు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేయటానికి మారణాయుధాలతో హైదరాబాద్ వచ్చాడు. ఆ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు చిక్కాడు.

MLA Jeevan Reddy : ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కుట్ర కేసు కలకలం రేపుతోంది. ఆర్మూర్ నియోజక వర్గం పరిధిలోని మక్లూర్ మండలం కల్లాడి గ్రామ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ ప్లాన్ రూపోందించాడు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేయటానికి మారణాయుధాలతో హైదరాబాద్ వచ్చాడు. ఆ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు చిక్కాడు. బంజారా హిల్స్, రోడ్ నెంబరు 12లో జీవన్ రెడ్డి నివసిస్తున్న వేమూరి ఎన్ క్లేవ్ వద్ద అనుమానాస్పదంగా తిరిగాడు. దీంతో ఎమ్మెల్యే సిబ్బంది బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జీవన్ రెడ్డి ఇంటివద్దకు వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్ మండలం కెల్లెడి గ్రామ సర్పంచ్ లావణ్యను కొద్దికాలం క్రితం పదవి నుంచి తప్పించారు. దీనికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డే కారణమని లావణ్య భర్త ప్రసాద్‌గౌడ్‌ అనుమానించాడు. జీవన్‌రెడ్డిని చంపాలని కక్ష గట్టాడు. ఇవాళ ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వేమూరి ఎన్‌క్లేవ్‌లో ఉన్న జీవన్‌రెడ్డి ఇంట్లోకి ప్రసాద్‌గౌడ్‌ పిస్టల్‌, కత్తితో ప్రవేశించాడు. ముందుగా జీవన్‌రెడ్డిని కలవాలంటూ సెక్యూరిటీ గార్డ్‌లను అడిగారు. అయితే ఎమ్మెల్యే పైన ఉన్నారని.. ఆయన వచ్చేదాకా కింద వెయిట్ చేయాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు.

MLA Jeevan Reddy : టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కుట్ర కేసులో సంచలన విషయాలు

కొంతసేపు అక్కడే ఉన్న ప్రసాద్‌గౌడ్.. గన్‌మెన్ల కళ్లు కప్పి పైఅంతస్తులో ఉన్న జీవన్‌రెడ్డి రూమ్‌ వరకు వెళ్లిపోయాడు. ఆయుధాలతో వచ్చిన ప్రసాద్‌గౌడ్‌ను చూసి షాకైన జీవన్‌రెడ్డి.. వెంటనే గన్‌మెన్లను అలర్ట్‌ చేశారు. దీంతో ప్రసాద్‌గౌడ్‌ను పట్టుకున్న గన్‌మెన్లు.. బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ప్రసాద్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్యేకి ప్రమాదం తప్పింది. జీవన్‌రెడ్డి అలర్ట్‌గా లేకపోయింటే.. ప్రసాద్‌గౌడ్‌ దాడి చేసేవాడు. అయితే తనపై హత్యా యత్నం వెనుక కుట్ర ఉందని జీవన్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎవరో కుట్ర చేసి ప్రసాద్‌గౌడ్‌ను పంపించారని అనుమానిస్తున్నారు.

గతంలో కెల్లెడి గ్రామ సర్పంచ్‌గా ప్రసాద్‌గౌడ్‌ భార్య లావణ్య పని చేసింది. భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రసాద్‌గౌడే పెత్తనం చెలాయిస్తూ.. అక్రమాలకు పాల్పడేవాడు. ఈ విషయం తెలియడంతో కెల్లెడి గ్రామస్తులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అధికారుల విచారణలో 11 లక్షల దాకా అవినీతి చేసినట్లు విచారణలో తేలడంతో.. లావణ్యను సర్పంచ్‌ పదవి నుంచి తొలగించారు. తమ అక్రమాలపై ఎంక్వైరీ చేసిన అధికారులపై ప్రసాద్‌గౌడ్‌ కక్షగట్టాడు. మండల పంచాయతీ ఆఫీసర్‌ శ్రీనివాస్‌పై దాడి చేశాడు. ఈ ఘటనపై మాక్లార్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. దాంతో జిల్లా స్థాయి అధికారులతో ఎమ్మెల్యే మరోసారి విచారణ చేయించారు. ఈ క్రమంలో జీవన్‌రెడ్డిపైనా ప్రసాద్‌గౌడ్‌ పగ పెంచుకున్నాడు. ఆయన్ను హత్య చేయడానికి కుట్ర చేశాడు.

ట్రెండింగ్ వార్తలు