Man Kills Son Over Chicken Curry
Chicken Curry : కోడి కూర కోసం తండ్రీ కొడుకుల మధ్య వచ్చిన మాటా మాటా ఏకంగా కొడుకును హత్య చేసేవరకు వెళ్లింది. క్షణికావేశంలో ఓ తండ్రి కొడుకుని కోడి కూర కోసం చంపేసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. షీనా అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో గుత్తిగర్ గ్రామంలో నివసిస్తున్నాడు. షీనాకు శివరామన్ అనే కొడుకు ఉన్నాడు. 32 రెండే శివరామన్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం (ఏప్రిల్ 4,2023)న షీనా భార్య కోడికూర వండింది. కోడి కూర మొత్తం షీనా తినేశాడు.
ఆ తరువాత ఇంటికొచ్చిన కొడుకు శివరామన్ అన్నం పెట్టమని తల్లిని అడిగాడు. తల్లి అన్నం పెట్టింది. కానీ కోడికూర వండావు కదా అది వడ్డించమని అడిగాడు కొడుకు. దానికి కూర అంతా అయిపోయిందని చెప్పింది. దీంతో అసలు విషయం చెప్పింది తల్లి. విషయం తెలిసి శివరాం అంతా నువ్వే తినేస్తావా? అంటూ తండ్రితో గొడవపడ్డాడు.
అలా మొదలైన మాటా మాటా పెరిగి..క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన షీనా.. శివరామన్ ను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు. దీంతో శివరాం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో శివరామ్ చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. కోడి కూర కోసం కొడుకుని చంపిన తండ్రి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.