18 ఏళ్ల యువతిని పెళ్ళి చేసుకున్న 48 ఏళ్ల కామబాబా అరెస్ట్

  • Publish Date - March 9, 2020 / 04:49 AM IST

పాద పూజ చేయాటానికి వచ్చిన 18 ఏళ్ల యువతిని మాయమాటలతో  లోబర్చుకుని తిరుపతి తీసుకువెళ్ళి  పెళ్ళి చేసుకున్న కర్ణాటక కు చెందిన దొంగబాబ రాఘవేంద్ర(48)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 9 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 

కారణమేంటో తెలీదు కానీ ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా బాబాలు,సాములోర్లు, జ్యోతిష్యులు చుట్టూ తెగ తిరుగుతున్నారు. దేవుడిపై ప్రజలకున్న మూఢనమ్మకాన్ని వీళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.  దీంతో వీరి వ్యాపారం మూడు టెంకాయలు, ఆరు తాయెత్తులు లాగా సాగిపోతోంది. ఈ ముసుగులో వీళ్లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వీళ్ల చేతిలో మోసపోయిన వారు బయటకు చెప్పుకోలేక మౌనంగా భరిస్తున్నారు. కొంత మంది మాత్రం బాబాలగుట్టు బయటపెట్టి వీరి భరతం పడుతున్నారు. ఇప్పుడు దాదాపు ఇలాంటి ఘటనే జరిగింది. 

కర్నాటక రాష్ట్రం కోలార్ తాలూకాలోని హోళలి గ్రామంలోని దత్తాత్రేయ అవధూత స్వామి అలియాస్‌ రాఘవేంద్ర  తనకు పాద పూజ చేయటానికి వచ్చిన 18 ఏళ్ళ యువతికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.  అనంతరం ఆమెను ఈ ఏడాది ఫిబ్రవరి 22, న తిరుమలకు తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు.

దీంతో యువతి తల్లి తండ్రులు కోలార్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.  నిత్యం కాషాయ వస్త్రాలు ధరించి గుబురు గడ్డంతో  భక్తులకు దర్సనం ఇచ్చిన స్వామీజీ యువతిని పెళ్ళి చేసుకున్నాక గడ్డం తీసేసి సల్మాన్ ఖాన్ లాంటి కండలతో టిక్ టాక్ వీడియోలు తీసి రిలీజ్ చేశాడు. ఆయువతితో  కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫోటోలు చూసిన యువతి తల్లి తండ్రులు ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసిన బాబా… యువతి బావ అరుణ్ కుమార్ కు ఫోన్ చేసి  బెదిరించాడు. నాపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తావా…. నేనిప్పుడు స్వామీజీ కాదన్నాడు. మా ఇద్దరి జోలికి వస్తే ఊరుకునేది లేదు నీ సంగతి చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఎంత ఖర్చు పెట్టయినా సరే నిన్ను ఖతం చేస్తానని బెదిరించాడు. కపట స్వామిజి బెదిరింపులను అరుణ్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. వాటిని పోలీసులకు అందచేశాడు. 

దొంగ బాబా కోసం గాలింపు చేపట్టిన పోలీసులు బాబా  మంగుళూరులో ఉన్నట్లు తెలుసుకున్నారు. యువతితో కలిసి  మంగుళూరు, గోకర్ణలోని గెస్ట్ హౌస్ లో  ఉన్న స్వామీజీని అరెస్టు చేశారు. స్వామీజిని పట్టుకోటానికి వచ్చిన పోలీసులను చూసిన యువతి స్వామిజీకి రివర్స్ అయ్యింది.  పాద పూజ కోసం వెళ్లిన తనను స్వామిజీ భయపెట్టి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. 

స్వామిజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మీద 420 కేసు నమోదు చేశారు. మరోవైపు తమ కూతురిని స్వామీజీ బలవంతంగా తీసుకెళ్లిపోయాడని యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటంతో కిడ్నాప్ కేసు,  తమను నమ్మించి  బాబా డబ్బులు తీసుకున్నాడని మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దొంగ బాబామీద మొత్తం 9కేసులు నమోదు చేసిన పోలీసులు చెప్పారు.

See More :

*  33 ఏళ్ళ నటితో 51 ఏళ్శ విలన్ డేటింగ్

*  బాయ్‌ఫ్రెండ్‌తో ఉండగా తల్లి వచ్చింది..ఆ తర్వాత బాలిక ఏం చేసింది